గతేడాది ఏ మాత్రం అంచనాలు లేకుండా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కి సంచలనం సృష్టించిన సినిమా ‘12th ఫెయిల్’. మనోజ్ కుమార్ శర్మ అనే ఐపీఎస్ ఆఫీసర్ జీవితం ఆధారంగా విధు వినోద్ చోప్రా ఈ మూవీని తెరకెక్కించాడు. విక్రాంత్ మస్సే హీరోగా నటించాడు. గతేడాది అక్టోబర్ 27వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఇక ఓటీటీలోకి వచ్చాక 12th ఫెయిల్ సినిమాకు మరింత క్రేజ్ వచ్చింది. డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ పై భారీ వ్యూస్ సొంతం చేసుకుంది . అలియాభట్, హృతిక్ రోషన్ లాంటి స్టార్ హీరోలు, హీరోయిన్లు ఈ సినిమాను చూసి చిత్ర బృందంపై ప్రశంసలు కురిపించారు. 12th ఫెయిల్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ+ హాట్‍స్టార్ సొంతం చేసుకుంది. అయితే గతేడాది డిసెంబర్ 29న కేవలం హిందీ వెర్షన్ మాత్రమే స్ట్రీమింగ్ కు అందుబాటులోకి వచ్చింది. థియేటర్లలో తెలుగు, తమిళం భాషల్లోనూ ఈ మూవీ రిలీజైనా.. ఓటీటీలోకి మాత్రం హిందీ వెర్షన్ మాత్రమే వచ్చింది. దీంతో 12th ఫెయిల్ తెలుగు వెర్షన్ కూడా స్ట్రీమింగ్ కు తీసుకురావాలంటై డిస్నీ ప్లస్ హాట్‍స్టార్ ఓటీటీని చాలా మంది రిక్వెస్ట్ చేశారు. మొత్తానికి ఇప్పుడు ఆ నిరీక్షణ ముగిసింది.
12th ఫెయిల్ సినిమా డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో తెలుగు వెర్షన్ కూడా అందుబాటులోకి వచ్చేసింది. సోమవారం (మార్చి 4) సాయంత్రం నుంచే తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడలోనూ ఈ బ్లాక్ బస్టర్ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలో హీరో, హీరోయిన్లు ఎవరూ లేరు. కేవలం పాత్ర ధారులే కనిపిస్తారు. అంతలా జనాల్లోకి చొచ్చుకెళ్లింది 12th ఫెయిల్ సినిమా. విక్రాంత్ మాసే తో పాటు మేధా శంకర్, అనంత్ వీ జోషి, ఆయుష్మాన్ పుష్కర్, ప్రియాన్షు చెటర్జీ, గీతా అగర్వాల్ శర్మ, హరీశ్ ఖన్నా తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాకు దర్శకత్వం వహించడమే కాకుండా నిర్మాత గానూ వ్యవహరించారు విధు వినోద్ చోప్రా. శాంతనూ మోయిత్రా స్వరాలు సమకూర్చారు. ప్రశంసలతో పాటు పురస్కారాలు అందుకున్న 12th ఫెయిల్ సినిమాను థియేటర్లలో మిస్ అయ్యారా? అయితే ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి. డోన్ట్ మిస్ ఇట్.
#12ThFail is Now Streaming on @DisneyPlusHS
in #Telugu, #Tamil, #Kannada & #Malayalam audios.#VidhuVinodChopra #VikrantMassey #12ThFaillMovie #12ThFailOnHotstar#OTTRelease #OTTUpdates #OTT pic.twitter.com/XSV9X5hc0L— OTTRelease (@ott_release) March 4, 2024
#12ThFail is Now Streaming on @DisneyPlusHS
in #Telugu, #Tamil, #Kannada & #Malayalam audios.#VidhuVinodChopra #VikrantMassey #12ThFaillMovie #12ThFailOnHotstar#OTTRelease #OTTUpdates #OTT pic.twitter.com/XSV9X5hc0L— OTTRelease (@ott_release) March 4, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.