
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతికి సినిమాలకు ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. తెలుగు, తమిళం, హిందీ భాషలలో పలు చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవలే ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా తలైవన్ తలైవి. ఈ చిత్రాన్ని తెలుగులో సార్ మేడమ్ పేరుతో డబ్ చేసి విడుదల చేశారు. ఇందులో నిత్యా మీనన్ కథానాయకగా నటించింది. తమిళంలో జూలై 25న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆగస్ట్ 1న తెలుగులో రిలీజ్ చేసారు. కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాకు అన్ని వర్గాల అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయ్యింది.
ఇవి కూడా చదవండి: Actress : ఈ క్రేజ్ ఏంట్రా బాబూ.. 40 ఏళ్లు దాటిన తగ్గని జోరు.. 50 సెకండ్స్ కోసం 5 కోట్లు రెమ్యునరేషన్..
ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా ఆగస్ట్ 22 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో ఈ మూవీ అందుబాటులోకి రానుంది. ఈ సందర్భంగా సార్ మేడమ్ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకు పాండిరాజ్ దర్శకత్వం వహించగా.. టీజీ త్యాగరాజన్ సమర్పణలో సత్య జ్యోతి ఫిలిమ్స్ బ్యానర్ పై సెంథిల్ త్యాగరాజన్ నిర్మించారు.
ఇవి కూడా చదవండి: అరాచకం భయ్యా.. వయ్యారాలతో గత్తరలేపుతున్న సీరియల్ బ్యూటీ..
కథ విషయానికి వస్తే..
ఈ సినిమాలో విజయ్ సేతుపతి, నిత్యా మీనన్ భార్యభర్తలుగా నటించారు. పెళ్లైన మొదట్లో ఎంతో అన్యోన్యంగా ఉన్న వీరిద్దరు ఆ తర్వాత ప్రతి విషయానికి చిరాకు, గొడవలు పడడం జరుగుతుంది. దీంతో వారి వైవాహిక జీవితంతోపాటు బిజినెస్ సైతం ప్రమాదంలో పడిపోతుంది. ఆ తర్వాత ఏమైంది..? అనేది కథ.
ఇవి కూడా చదవండి: Dulquer Salman: ఆ హీరోయిన్ అంటే పిచ్చి ఇష్టం.. ఎప్పటికైనా ఆమెతో నటించాలనే కోరిక.. దుల్కర్ సల్మాన్..
Get ready to fall in love with Aagasaveeran and Perarasi… twice 👀#ThalaivanThalaiviiOnPrime, Aug 22@VijaySethuOffl @MenenNithya @pandiraaj_dir @iYogiBabu@Music_Santhosh @SathyaJyothi @Lyricist_Vivek @studio9_suresh@Roshni_offl @kaaliactor @MynaNandhini @ActorMuthukumar pic.twitter.com/VqI3bn7zqP
— prime video IN (@PrimeVideoIN) August 15, 2025
ఇవి కూడా చదవండి: Actor: అన్నపూర్ణ స్టూడియో 50 ఏళ్ళు.. శంకుస్థాపన చేస్తోన్న చిన్నోడు ఎవరో తెలుసా..?