Vijay Deverakonda: వన్ ఆఫ్ ది బెస్ట్ అంటూ.. అమలాపాల్ వెబ్‌‌‌‌‌సిరీస్ పై ప్రశంసలు కురిపించిన రౌడీ

ఓటీటీ వేదికగా అనేక సినిమాలు, వెబ్ సిరీస్ లు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అదిరిపోయే కంటెంట్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్న ఏకైక తెలుగు మాధ్యమం ఆహా...

Vijay Deverakonda: వన్ ఆఫ్ ది బెస్ట్ అంటూ.. అమలాపాల్ వెబ్‌‌‌‌‌సిరీస్ పై ప్రశంసలు కురిపించిన రౌడీ
Aha

Updated on: Jul 23, 2021 | 4:24 PM

Kudi Yedamaithe : ఓటీటీ వేదికగా అనేక సినిమాలు, వెబ్‌‌‌సిరీస్‌‌‌లు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అదిరిపోయే కంటెంట్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్న ఏకైక తెలుగు మాధ్యమం ఆహా… ప్రతివారం ఇంట్రస్టింగ్ మూవీస్, థ్రిల్లింగ్ వెబ్‌‌‌సిరీస్‌‌‌లతో ప్రేక్షకులను అలరిస్తోంది ఆహా. ఈ మధ్య ఆహాలో విడుదలైన వెబ్‌‌సిరీస్‌‌‌లలో మంచి టాక్‌‌‌ను సొంతం చేసుకున్న వెబ్‌‌‌‌సిరీస్ కుడిఎడమైతే . సూప‌ర్ డూప‌ర్ విజ‌యాల‌ను అందించిన డైరెక్టర్ ప‌వ‌న్‌కుమార్ ఈ వెబ్ సిరీస్‌ను తెర‌కెక్కించారు. అమ‌లాపాల్‌, రాహుల్ విజ‌య్‌, ప‌ద్మిని సేట్టం, రాజ్ మాదిరాజ్ కీల‌క పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందింది. క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ `కుడి ఎడ‌మైతే`ను జూలై 16న ఆహాలో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. పోలీస్‌ ఆఫీసర్‌ దుర్గ(అమలాపాల్‌), డెలివరీ బాయ్‌ ఆది(రాహుల్ విజయ్‌) మధ్య నడిచే  ఈ ఆసక్తికర సిరీస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.

తాజాగా ఈ సినిమాపై టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ ప్రశంసలు కురిపించారు. ఇప్పుడే కుడిఎడమైతే సిరీస్‌‌ను చూశాను. ఈ వెబ్‌‌సిరీస్ చాలా నచ్చింది. అమలాపాల్, రాహుల్ విజయ్‌ నటన ఆకట్టుకుందని అన్నారు. ఇక ఇప్పటి వరకు వచ్చిన వాటిలో ఇది ఒక బెస్ట్ సిరీస్ అన్నారు విజయ్. అలాగే సిరీస్ 2 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ట్విట్టర్ లో రాసుకొచ్చారు. ఇండియాలో మొదటిసారి టైమ్‌ లూప్‌ అనే పాయింట్‌ మీద ‘కుడి ఎడమైతే’ వెబ్‌ సిరీస్‌ రూపొందింది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Godzilla vs Kong: ఓటీటీలో సందడి చేయనున్న గాడ్జిల్లా వర్సెస్ కాంగ్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..

Sandeep Kishan : సందీప్ కిషన్ ‘ఎ1 ఎక్స్‌ప్రెస్’ సరికొత్త రికార్డ్..! యూట్యూబ్‌లో 40 మిలియన్లకు పైగా వ్యూస్‌..

Kangana Ranaut : బాగోతాన్ని బయటపెడతా.. శిల్పాశెట్టి భర్త అరెస్ట్ పై కంగనా సంచలన కామెంట్లు