OTT Movie: ఒక పొలిటికల్ బ్రోకర్‌కు 6, 200 కోట్ల ఆస్తులా? ఓటీటీలో విజయ్ ఆంటోని లేటెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్

ఈ ఏడాది ఇప్పటికే 'మార్గన్' అనే సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు విజయ్ ఆంటోని. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన ఈ సినిమా ఓటీటీలో మాత్రం దుమ్ము రేపింది. దీని తర్వాత మరో పొలిటికల్ థ్రిల్లర్ మూవీతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడీ హీరో కమ్ డైరెక్టర్

OTT Movie: ఒక పొలిటికల్ బ్రోకర్‌కు 6, 200 కోట్ల ఆస్తులా? ఓటీటీలో విజయ్ ఆంటోని లేటెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్
OTT Movie

Updated on: Oct 15, 2025 | 2:16 PM

బిచ్చగాడు సినిమాతో తెలుగు ఆడియెన్స్‌కు బాగా దగ్గరయ్యాడు విజయ్ ఆంటోనీ. ఆ తర్వాత చాలా సినిమాలు చేశాడు. కాన్సెప్టుల పరంగా ప్రశంసలు అందుకుంటున్నా కమర్షియల్ గా హిట్ కొట్టలేకపోతున్నాడీ ట్యాలెంటెడ్ హీరో కమ్ డైరెక్టర్. అయినా తన ప్రయత్నాలు ఆపడం లేదు. వరుసగా సినిమాలు చేస్తున్నాడు. అలా ఈ ఏడాది ప్రారంభంలో మార్గన్ అనే సినిమాతో మన ముందుకొచ్చాడు విజయ్ ఆంటోని. ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడినా ఓటీటీలో మాత్రం దుమ్ము రేపింది. దీని తర్వాత భద్రకాళి అనే మరో సినిమాలో నటించాడు విజయ్. అరుణ్ ప్రభు తెరకెక్కించిన ఈ సినిమాను విజయ్ ఆంటోని నిర్మించడం విశేషం. . గ‌త నెల 19న థియేటర్లలో విడుదలైన భద్రకాళి సినిమా ఓ మోస్తరుగా మాత్రమే ఆడింది. అయితే పెద్దగా ప్రమోషన్లు చేయకపోవడంతో లాంగ్ రన్ కొనసాగించలేకపోయింది. అయితే ఈ సినిమా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందన్నారు చాలా మంది. పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీలో ట్విస్టులు బాగానే ఉన్నాయని కాంప్లిమెంట్స్ వినిపించాయి. ఇలా థియేటర్లలో యావరేజ్ రిజల్ట్ సొంతం చేసుకున్న భద్రకాళి సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది.

విజయ్ ఆంటోని ‘భద్రకాళి’ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్ స్టార్ చేసుకుంది. ఈ మేరకు సినిమా స్ట్రీమింగ్ అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా ఇచ్చింది. ఈనెల 24 నుంచి భద్రకాళి సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు జియో హాట్ స్టార్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఈ సినిమాను ఓటీటీలోకి అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపింది. భద్రకాళి సినిమాలో విజయ్ ఆంటోనీతో పాటు వాగై చంద్రశేఖర్, సునీల్ కృపలానీ, కిరణ్, సెల్ మురుగన్, తృప్తి రవీంద్ర తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాలో  విజయ్ ఆంటోనీ కిట్టు  పాత్రలో ఆకట్టుకున్నాడు. సెక్రటేరియట్‌లో ఓ పవర్ బ్రోకర్ గా ఉండే తను ఎలా కోట్లాది ఆస్తులు కూడ బెట్టాడు? చివరకు ఏమైందన్నదే ఈ సినిమా స్టోరీ.

ఇవి కూడా చదవండి

 

 తెలుగులోనూ స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.