Chhaava OTT: ఓటీటీలోకి ఛావా.. విక్కీ కౌశల్, రష్మికల బ్లాక్ బస్టర్ మూవీ స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

|

Mar 24, 2025 | 11:22 AM

మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఛావా. విక్కీ కౌశల్, రష్మిక మందన్నా ప్రధాన పాత్రలు పోషించిన ఈ పీరియాడికల్ మూవీ థియేటర్లలో ఏకంగా రూ. 700 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

Chhaava OTT: ఓటీటీలోకి ఛావా.. విక్కీ కౌశల్, రష్మికల బ్లాక్ బస్టర్ మూవీ స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
Chhaava Movie
Follow us on

బాలీవుడ్ స్టార్ నటుడు విక్కీ కౌశల్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ఛావా. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా మరాఠీ దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ ఈ సినిమాను తెరకెక్కించారు. గతేడాదే రిలీజ్ కావాల్సిన ఈ పీరియాడికల్ మూవీ అనూహ్యంగా వాయిదా పడింది. అయితే ఫిబ్రవరి 14న ఏ మాత్రం అంచనాలు లేకుండా ఛావా థియేటర్లలోకి వచ్చేసింది. మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఉత్తరాది ప్రేక్షకులు ఈ సినిమాకు బాగా కనెక్ట్ అయ్యారు. దీంతో దక్షిణాది భాషల్లోనూ ఈ సినిమాను రిలీజ్ చేశారు. మార్చి 07న తెలుగులోనూ ఛావా మూవీ రిలీజ్ కాగా, ఇక్కడ కూడా మంచి వసూళ్లే రాబడుతోంది. ఇప్పటికీ చాలా చోట్ల ఈ సినిమా థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. ఇక ఓటీటీలో ఛావా సినిమాను చూడాలని చాలా మంది ఆడియెన్స్ ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. సుమారు నెల రోజుల తర్వాతే ఓటీటీలోకి ఈ మూవీని తీసుకుని రావాలని ముందుగానే డీల్ జరిగిందట. అయితే ఇటీవల ఛావా మూవీ ఆన్ లైన్ లో దర్శనమిచ్చింది. కొందరు ఈ మూవీని పైరసీ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో త్వరలోనే ఛావా సినిమా ఓటీటీలోకి రానుందట.

ప్రస్తుతమున్న సమాచారం ప్రకారం ఏప్రిల్ 11న ఛావా సినిమా ఓటీటీలోకి రానుందని సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుందని సమాచారం. మాడాక్ ఫిల్మ్స్ బ్యానర్ పై దినేష్ విజన్ నిర్మించిన ఛావా సినిమాలో అక్షయ్ ఖన్నా ఔరంగజేబుగా అందరి మన్ననలు అందుకున్నాడు. అలాగే డయానా పెంటీ, అశుతోష్ రాణా, దివ్య దత్తా, వినీత్ కుమార్ సింగ్, సంతోష్ జువేకర్, అలోక్నాథ్, ప్రదీప్ రావత్ తదితర ప్రముఖులు ఈ సినిమాలో వివిధ పాత్రలు పోషించారు. ఇక ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది.

ఇవి కూడా చదవండి

తెలుగు రాష్ట్రాల్లో చావా థియేటర్లలో పరిస్థితి ఇది..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.