కోలీవుడ్ హీరో వైభవ్, టాలీవుడ్ హీరోయిన్ నందితాశ్వేత ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం రణం. తమిళంలో రణం అరమ్ థవరేల్ పేరుతో రిలీజైన ఈ చిత్రం అక్కడి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఆద్యంతం ట్విస్టులతో సాగే ఈ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ప్రముఖ మూవీ రేటింగ్ ప్లాట్ ఫామ్ ఐఎండీబీ రణం సినిమాకు 7.8 రేటింగ్ ఇవ్వడం విశేషం. ఇలా ఎన్నో విశేషాలతో కూడిన ఈ థ్రిల్లర్ మూవీ మరికొన్ని గంటల్లో డిజిటల్ స్ట్రీమింగ్ కు రానుంది. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా మూడు ఓటీటీ వేదికల్లో రణం మూవీ సందడి చేయనుంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం అయిన అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగానే కాకుండా టెంట్ కొట్టా, సింప్లీ సౌత్ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో శుక్రవారం (ఏప్రిల్ 19) నుంచి రణం సినిమా అందుబాటులోకి రానుంది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది.
షరీఫ్ దర్శకత్వం వహించిన రణం సినిమాలో వైభవ్, నందిత శ్వేతలతో పాటు సురేష్ చక్రవర్తి, తాన్య హోప్, సరస్వతీ మీనన్, జీవా సుబ్రహ్మణ్యన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించారు. ఇక కథవిషయానికి వస్తే (వైభవ్) ఓ స్కెచ్ ఆర్టిస్ట్. తలలు గుర్తుపట్టకుండా జరిగిన హత్యలను పరిష్కరించడంలో పోలీసులకు సాయం చేస్తుంటాడు. ఓ రోజు నగరంలో ఓ డెబ్‌బాడీకి సంబంధించి పార్ట్‌లు మూడు వేర్వేరు ప్రదేశాల్లో దొరుకుతాయి. తల మాత్రం మిస్సవుతుంది. ఆ తర్వాత మరికొన్ని హత్యలు ఇదే తరహాలో జరుగుతాయి. మరి ఈ హత్యలు చేస్తున్నదెవరు?వైభవ్ వారిని పట్టుకున్నాడా?లేదా? అన్నది తెలుసుకోవాలంటే రణం సినిమా చూడాల్సిందే. మంచి ట్విస్టింగ్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా మంచి ఛాయిస్ అని చెప్పుకోవచ్చు.
#Ranam OTT Release On April 19
Starring: #Vaibhav – #NanditaSwetha – #TanyaHope – #SaraswathiMenon
Music: #ArrolCorelli
Direction: #Sheriff pic.twitter.com/j99WJOEIvS
— Tamil Film Update (@tweettamilfilm) April 17, 2024
Tamil Film #Ranam Streaming On @PrimeVideoIN From APRIL 19 . .#RanamOnPrime#Vaibhav @TanyaHope_offl
Follow ✴️ @Digital_OTT pic.twitter.com/SgirwqyrX6
— DIGITAL OTT PLATFORM (@Digital_OTT) April 17, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.