
కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర చాలా కాలం తర్వాత సిల్వర్ స్ర్కీన్‌పై కనిపించిన చిత్రం కబ్జా. పాన్ ఇండియా స్థాయిలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమాలో కిచ్చా సుదీప్, శివరాజ్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. శ్రియా శరణ్ హీరోయిన్ గా నటించింది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాకు ఆర్.చంద్రు దర్శకత్వం వహించారు. టీజర్లు, ట్రైలర్లతో సంచలనాలు సృష్టించిన ఈ చిత్రం మార్చి 17వ తేదీన గ్రాండ్‌గా రిలీజైంది. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. అయితే కేజీఎఫ్‌తో పోలిక రావడం కబ్జా సినిమాకు మైనస్‌గా మారింది. దీంతో థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కలెక్షన్ల పరంగానూ పెద్దగా లాభాలు తీసుకురాలేకపోయింది. అయితే చాలా రోజుల తర్వాత ఉపేంద్ర సిల్వర్ స్ర్కీన్‌పై కనిపించడం, సినిమాలోని కొన్ని ఎలివేషన్ సీన్లు అభిమానులను బాగానే ఆకట్టుకున్నాయి. అలాగే కేజీఎఫ్ ఆలోచనలను పక్కన పెట్టి ఫ్రెష్ ఫీల్‌తో కబ్జాను చూస్తే బాగా ఎంజాయ్ చేయవచ్చని రివ్యూలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కబ్జా ఓటీటీ రిలీజ్ కోసం సినిమా ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశాను. ఇప్పుడీ నిరీక్షణకు తెరపడింది. కబ్జా మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది.
తాజాగా కబ్జా సినిమాను ఏప్రిల్ 14 నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా అధికారిక ప్రకటన విడుదల చేసింది అమెజాన్. సుమారు కాగా రూ. 110 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా థియేటర్‌లో విడుదలైన 25 రోజుల లోపే ఓటీటీలో స్ట్రీమింగ్ కానుండడం గమనార్హం. ఈ సినిమాలో కోట శ్రీనివాసరావు, పోసాని కృష్ణమురళి, కబీర్ దుహాన్ సింగ్, నవాబ్ షా, ప్రమోద్ శెట్టి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. తాన్యా హోప్ స్పెషల్ సాంగ్‌లో కనిపించి కనువిందు చేసింది. మరి థియేటర్లలో కబ్జా సినిమాను మిస్ అయిన వారు ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.
a tale of unforeseen circumstances transforming an innocent young man into the most dreaded gangster ever! ?#KabzaaOnPrime, Apr 14 pic.twitter.com/wCRRyIDeAI
— prime video IN (@PrimeVideoIN) April 11, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..