Aha OTT: ఆహా ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. ట్రైలర్ అదిరిపోయింది..

సినీప్రియులను ఆకట్టుకునేందుకు ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ ఎప్పటికప్పుడు సరికొత్త చిత్రాలను అడియన్స్ ముందుకు తీసుకువస్తుంది. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ కాదు.. రొమాంటిక్ లవ్ స్టోరీస్, కామెడీ డ్రామాలను ప్రేక్షకులకు అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు మరో బ్లాక్ బస్టర్ యాక్షన్ మూవీ సైతం రాబోతుంది.

Aha OTT: ఆహా ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. ట్రైలర్ అదిరిపోయింది..
Marco Movie

Updated on: Feb 20, 2025 | 9:06 PM

మలయాళీ స్టార్ హీరో ఉన్ని ముకుందన్ బ్లాక్ బస్టర్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ “మార్కో”. థియేటర్లలో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ మూవీ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమా రేపటి నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రాన్ని దర్శకుడు హనీఫ్ అడేని రూపొందించారు. అలాగే ఈ సినిమాను క్యూబ్ ఎంటర్ టైన్ మెంట్స్, ఉన్ని ముకుందన్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మించాయి.

ఈ రోజు మార్కో కొత్త ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ థ్రిల్లింగ్ యాక్షన్ ఎపిసోడ్స్, ఎమోషన్ తో ఆకట్టుకుంటోంది. తను ఎంతో ప్రేమించే సోదరుడు విక్టర్ ను చంపిన వారిపై మార్కో పగ తీర్చుకునే తీరు హై ఎండ్ యాక్షన్ సీక్వెన్సులతో ఇంప్రెస్ చేసింది. ఈ చిత్రంలో ఉన్ని ముకుందన్ తో పాటు సిద్ధిక్, జగదీష్, అభిమన్యు ఎస్ తిలకన్, కబీర్ దుహాన్ సింగ్, అన్సన్ పాల్, యుక్తి తరేజా కీలక పాత్రల్లో నటించారు. గతేడాది డిసెంబర్ 20న వరల్డ్ వైడ్ రిలీజ్ మలయాళ చిత్ర పరిశ్రమలో అత్యధిక వసూళ్లు సాధించింది. మార్కో తెలుగులోనూ రిలీజై ఘన విజయాన్ని అందుకుంది. ఆహా ఓటీటీ ద్వారా మార్కో సినిమా మరింతమంది మూవీ లవర్స్ కు రీచ్ కానుంది.

ఇవి కూడా చదవండి

గతేడాది మలయాళంలో హయ్యేస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల్లో ఇది ఒకటి. అంతేకాకుండా ఏ రేటింగ్ తో రిలీజ్ అత్యధిక వసూళ్లు రాబట్టిన మూవీగా నిలిచింది. కేవలం 30 కోట్ల బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమా దాదాపు రూ.115 కోట్లు వసూలు చేసింది.

ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..

Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..

Tollywood: అప్పట్లో లిరిల్ సోప్ యాడ్ గర్ల్.. ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్.. ఫాలోయింగ్ చూస్తే మైండ్ బ్లాంకే..

Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్‏లోకి వెళ్లిపోయిన