Nacchindi Girl Friendu: ఓటీటీలోకి ‘నచ్చింది గర్ల్‌ ఫ్రెండూ’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే?

'ఆటగదరా శివ' సినిమాతో హీరోగా తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నాడు ఉదయ్‌ శంకర్‌. ఆతర్వాత మిస్‌ మ్యాచ్‌, క్షణక్షణం సినిమాలతో టాలీవుడ్‌ ఆడియెన్స్‌కు బాగా దగ్గరయ్యాడు. అతను నటించిన మరో యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌ టైనర్‌ 'నచ్చింది గర్ల్‌ ఫ్రెండూ'.

Nacchindi Girl Friendu: ఓటీటీలోకి నచ్చింది గర్ల్‌ ఫ్రెండూ.. స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే?
Nacchindi Girl Friendu Movie

Updated on: Jul 19, 2023 | 7:38 PM

‘ఆటగదరా శివ’ సినిమాతో హీరోగా తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నాడు ఉదయ్‌ శంకర్‌. ఆతర్వాత మిస్‌ మ్యాచ్‌, క్షణక్షణం సినిమాలతో టాలీవుడ్‌ ఆడియెన్స్‌కు బాగా దగ్గరయ్యాడు. అతను నటించిన మరో యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌ టైనర్‌ ‘నచ్చింది గర్ల్‌ ఫ్రెండూ’. గురుపవన్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీలో జెన్నీఫర్‌ ఇమ్మాన్యుయేల్‌ కథానాయికగా కనిపించింది. మధునందన్‌, సుమన్‌, పృథ్వీరాజ్‌, శ్రీకాంత్ అయ్యంగార్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. గతేడాది నవంబర్‌ 11న విడుదలైన ఈ మూవీ యువతను బాగా ఆకట్టుకుంది. కానీ వివిధ కారణాల వల్ల ఓటీటీలో మాత్రం రిలీజ్‌ కాలేదు. అయితే ఎట్టకేలకు నచ్చింది గర్ల్‌ ఫ్రెండూ మూవీ డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు రానుంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆహాలో ఈ నెల 21 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్‌ కానుంది. ఈ మేరకు సదరు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నచ్చింది గర్ల్‌ ఫ్రెండూ కొత్త ట్రైలర్‌ను రిలీజ్‌ చేసింది.

కథేంటంటే..

‘ ఫిబ్రవరి 13.. నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని రోజు’ అంటూ మొదలయ్యే ట్రైలర్‌ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ప్రేమించిన అమ్మాయి చేతిలో మోసపోయిన హీరో ఆ అమ్మాయిపై ఎలా రివేంజ్‌ తీర్చుకున్నాడు? అనే ఇంట్రెస్టింగ్‌ పాయింట్‌తో నచ్చింది గర్ల్‌ ఫ్రెండూ తెరకెక్కినట్లు తెలుస్తోంది. మరి థియేటర్లలో ఈ మూవీని మిస్‌ అయిన వారు ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్‌ చేయండి..

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి