TV9 నెట్‌వర్క్ మరో సంచలనానికి తెర.. ప్రపంచంలోనే తొలిసారిగా ఓటీటీ ప్లాట్‌ఫామ్ ద్వారా న్యూస్ సేవలు

|

Feb 14, 2022 | 8:33 PM

News9 Plus: తెలుగు గడ్డపై సంచలనం సృష్టించి దేశంలోనే అతిపెద్ద నెట్‌వర్క్‌గా విస్తరించిన TV9 నెట్‌వర్క్ మరో సంచలనానికి తెరలేపింది. 2020లో డిజిటల్ న్యూస్ డొమైన్‌లోకి..

TV9 నెట్‌వర్క్ మరో సంచలనానికి తెర.. ప్రపంచంలోనే తొలిసారిగా ఓటీటీ ప్లాట్‌ఫామ్ ద్వారా న్యూస్ సేవలు
Follow us on

News9 Plus: తెలుగు గడ్డపై సంచలనం సృష్టించి దేశంలోనే అతిపెద్ద నెట్‌వర్క్‌గా విస్తరించిన TV9 నెట్‌వర్క్ మరో సంచలనానికి తెరలేపింది. 2020లో డిజిటల్ న్యూస్ డొమైన్‌లోకి అడుగు పెట్టి అద్భుతాలు సృష్టించిన టీవీ9.. ఇప్పుడు మరో చరిత్ర లిఖించడానికి సిద్ధమైంది. ప్రపంచంలోనే తొలిసారిగా ఓటీటీ (OTT) ప్లాట్‌ఫామ్ ద్వారా న్యూస్ సేవలను ప్రారంభిస్తోంది. ఇందులో భాగంగా Tv9 నెట్‌వర్క్ త్వరలో News9 Plusని ప్రారంభించనుంది. ఈ నెలలో బీటా వెర్షన్‌ ప్రారంభం కానుండగా.. మార్చి చివరి నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. ఇది ప్రపంచంలోని మొట్టమొదటి ప్యూర్‌ప్లే సబ్‌స్క్రిప్షన్-ఆధారిత, ఆన్-డిమాండ్ కంటెంట్‌గా రానుంది. News9 Plus అనేక భాషల్లో లాంఛ్ అవనుందని టీవీ9 నెట్‌వర్క్‌ సీఈఓ బరున్ దాస్ తెలిపారు.

2020లో డిజిటల్ న్యూస్ డొమైన్‌లోకి అడుగు పెట్టి.. భారతదేశపు అతిపెద్ద టెలివిజన్ న్యూస్ నెట్‌వర్క్ TV9 అంచెలంచెలుగా ఎదిగి ముందుకు సాగుతోంది. అయితే జాతీయ మీడియా దిగ్గజం న్యూస్9 ప్లస్ పేరుతో ఇంగ్లీష్ న్యూ్స్ ఛానెల్‌ను OTT ఫార్మాట్‌లో ప్రారంభించనుంది. ఇందులో వార్తలు, విశ్లేషణలు, చర్చా కార్యక్రమాలు వంటి అన్ని అంశాలను ప్రసారం చేయడం జరుగుతుంది.

‘‘చారిత్రాత్మకంగా, భారతీయ వార్తా శైలి తనను తాను అణగదొక్కుకుంటూ స్వీయ వైకల్యాన్ని అనుభవస్తోంది. అలాగే టీవీ న్యూస్ ఛానల్స్ ప్రసారాలు పూర్తి ఉచితం. కేవలం ప్రకటన ద్వారా వచ్చే రాబడితోనే మనుగడ సాగించాల్సిన పరిస్థితి మీడియాకు ఏర్పడింది. మరోవైపు చాలామంది వినియోగదారులు డిజిటల్ వార్తల కోసం కొంత మొత్తం చెల్లించే విధానం మొదలైంది. అయితే, డిజిటల్ వార్తల కోసం చెల్లించే ఈ ప్రవృత్తి.. డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫామ్‌లు వినియోగదారులకు ఏం కావాలి? వారు ఏం కోరుకుంటున్నారు? అనే దానిపై ఆధారపడి ఉంటుంది.’’ అని టీవీ9 నెట్‌వర్క్‌ సీఈవో బరున్ దాస్ పేర్కొన్నారు.

‘‘ఇంగ్లీష్ న్యూస్ టెలివిజన్ స్పేస్‌లో గత కొన్ని సంవత్సరాలుగా వీక్షకుల సంఖ్య, ఆదాయం గణనీయంగా తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం OTTకి ప్రాముఖ్యత పెరుగుతోంది. దీన్నిబట్టి చాలామంది వీక్షకులు OTT వార్తా సేవల కోసం ఎదురు చూస్తున్నట్లు స్పష్టమవుతోంది. నా అభిప్రాయం ప్రకారం, లీనియర్ న్యూస్ టెలివిజన్ సమీప భవిష్యత్తులో OTT వార్తల సేవకు దారి తీస్తుంది. హిందీ, ప్రాంతీయ భాషా మార్కెట్‌లు ప్రస్తుత లీనియర్ టీవీ మోడ్‌లో మరికొంత కాలం కొనసాగవచ్చు. అయితే ఆంగ్లంలో అత్యాధునిక OTT వార్తలను అందించడానికి సమయం ఆసన్నమైంది. సాంకేతికత అందిపుచ్చుకుని, లోతుగా జ్ఞానంతో కూడిన కంటెంట్, ఆకర్షణీయమైన కంటెంట్‌ను అందించగల అత్యుత్తమ సాధనంగా News9 Plus ఉండటానికి ప్రయత్నిస్తుంది. News9 Plus డిజిటల్ న్యూస్ వీక్షకులకు అనుగుణమైన కంటెంట్‌ని అందించే దిశగా పని చేస్తుంది. భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే మొదటి OTT కంటెంట్‌ను అందిస్తున్నందుకు గర్విస్తున్నాం. OTT వార్తా సేవలు భారతదేశంలో తప్పకుండా సక్సెస్‌ అవుతుందని భావిస్తున్నాం.’’ అని బరున్ దాస్ చెప్పారు.

న్యూస్ 9 ప్లస్ వార్తా ఛానెల్‌ తమ వీక్షకులపై ఒత్తిడిని దూరం చేస్తుంది. యూజర్లకు మెరుగైన వీడియో కంటెంట్‌ను అందించేందుకు ప్రయత్నాలు చేస్తోందని TV9 నెట్‌వర్క్ గ్రూప్ ఎడిటర్ BV రావు అన్నారు. న్యూస్9 ప్లస్ వివిధ రకాల కంటెంట్‌లను హోస్ట్‌ చేస్తుందని అన్నారు. భవిష్యత్తులో కంటెంట్‌ విషయంలో వెనుకడుగు వేయకుండా ముందుకెళ్తామన్నారు. ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు అందించే విధంగానే సబ్‌స్క్రైబర్‌లు న్యూస్9ప్లస్‌లో ప్రత్యేకమైన సిరీస్‌లు, సీజన్‌లు, ఎపిసోడ్‌లను చూస్తారని అన్ననారు.

ఇవి కూడా చదవండి:

Kalavathi Song: దూసుకుపోతున్న కళావతి సాంగ్‌.. సౌత్‌ ఇండియన్‌ ఫిలిమ్‌ ఇండస్ట్రీలోనే తొలి పాటగా..

Vijay Beast: విజయ్‌ బీస్ట్‌ నుంచి లిరికల్‌ సాంగ్‌.. అదిరిపోయే స్టెప్స్‌తో మరోసారి ఆకట్టుకున్న ‘బుట్టబొమ్మ’..