OTT: భయపెట్టేందుకు ఓటీటీలోకి వచ్చేసిన భార్గవి నిలయం .. చంద్రముఖిని మించి.. ఎక్కడ చూడొచ్చంటే?

ఈ వారం బోలెడు సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ కు వచ్చాయి. శుక్రవారం (సెప్టెంబర్ 06) అర్ధ రాత్రి నుంచే వివిధ ఓటీటీ ప్లాట్ ఫామ్స్‌ లోకి పలు సినిమాలు అందుబాటులోకి వచ్చాయి. ఇక ఓటీటీలంటే కచ్చితంగా మలయాళం సినిమాలు ఉండాల్సిందే. ప్రతి వారం ఏదో ఒక మాలీవుడ్ మూవీ స్ట్రీమింగ్ కు రావాల్సిందే. అలా ఈ వారం కూడా ఒక మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ తెలుగులోకి స్ట్రీమింగ్ కు వచ్చేసింది.

OTT: భయపెట్టేందుకు ఓటీటీలోకి వచ్చేసిన భార్గవి నిలయం .. చంద్రముఖిని మించి.. ఎక్కడ చూడొచ్చంటే?
Bhargavi Nilayam Movie
Follow us
Basha Shek

|

Updated on: Sep 07, 2024 | 10:16 AM

ఈ వారం బోలెడు సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ కు వచ్చాయి. శుక్రవారం (సెప్టెంబర్ 06) అర్ధ రాత్రి నుంచే వివిధ ఓటీటీ ప్లాట్ ఫామ్స్‌ లోకి పలు సినిమాలు అందుబాటులోకి వచ్చాయి. ఇక ఓటీటీలంటే కచ్చితంగా మలయాళం సినిమాలు ఉండాల్సిందే. ప్రతి వారం ఏదో ఒక మాలీవుడ్ మూవీ స్ట్రీమింగ్ కు రావాల్సిందే. అలా ఈ వారం కూడా ఒక మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ తెలుగులోకి స్ట్రీమింగ్ కు వచ్చేసింది. అదే 2018 ఫేమ్ టొవినో థామస్ హీరోగా నటించిన నీలవెలిచం. తెలుగులో భార్గవి నిలయం పేరుతో ఓటీటీలోకి వచ్చేసింది. గతేడాది ఏప్రిల్ 20న మలయాళంలో రిలీజైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. ఆషిక్ అబు తెరకెక్కించిన ఈ సూపర్ హారర్ థ్రిల్లర్ సినిమాలో టొవినో థామస్ తో పాటు రిమా కల్లింగల్, రోషన్ మాథ్యూ, దసరా విలన్ షైన్ టామ్ చాకో ప్రధాన పాత్రల్లో మెరిశారు. రాజేశ్ మాధవన్, చెంబన్ వినోద్ జోస్, అభిరామ్ రాధాకృష్ణన్, ప్రమోద్ వెలియనాడ్ తదితరులు కూడా వివిధ పాత్రల్లో మెప్పించారు. మాలీవుడ్ ఆడియెన్స్ మెప్పు పొందిన ఈ హారర్ థ్రిల్లర్ మూవీ ఇప్పుడు భార్గవి నిలయం పేరుతో తెలుగులోకి వచ్చేసింది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.

బ‌షీర్ (టోవినో థామ‌స్‌) ఓ ప్రముఖ రైట‌ర్‌. కథ రాయ‌డానికి స‌ముద్రం ఒడ్డున ఉన్న ఓ ఊరికి వ‌స్తాడు. ఊరి చివ‌ర ఉన్న భార్గవి నిల‌యం అనే పురాత‌న భ‌వంతిలో అద్దెకు దిగుతాడు. ఆ ఇంట్లో భార్గవి (రీమా క‌ల్లింగ‌ల్‌) అనే అమ్మాయి ఆత్మ ఉంద‌ని అంద‌రూ నమ్ముతుంటారు. ఇంట్లో ఎవ‌రూ అడుగుపెట్టినా స‌హించ‌ని భార్గవి ఆత్మ బ‌షీర్‌ను మాత్రం ఏం చేయ‌దు. భార్గవి గురించి నిజం తెలుసుకుని దానిని కథగా రాయలని బషీర్ నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో బషీర్ కు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? భార్గవి ఎలా చనిపోయింది? అన్నది తెలుసుకోవాలంటే భార్గవి నిలయం సినిమా చూడాల్సిందే. హారర్, సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాలు చూసే వారికి ఈ మూవీ ఒక మంచి ఛాయిస్ అని చెప్పుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

ఆహాలో స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.