Newsense: ఆహా ఒరిజినల్ సిరీస్ ‘న్యూసెన్స్’కు అద్భుతమైన రెస్పాన్స్.. త్వరలోనే సీజన్ -2..
‘న్యూసెన్స్ సీజన్ 1’.. ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సరికొత్త వెబ్ ఒరిజినల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫ్లాట్‌ఫామ్స్‌లో ఓ తుపానులా ప్రభంజనం సృష్టిస్తోంది. గ్రిప్పింగ్ నెరేషన్, ఆలోచననను రేకెత్తించే కథాంశంతో రూపొందిన ఈ వెబ్ సిరీస్ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటోంది. ఈ అసాధారణ విజయాన్ని సాధించిన సందర్భంగా ‘న్యూసెన్స్’ సక్సెస్‌మీట్‌ను చిత్ర యూనిట్ నిర్వహించింది.
‘న్యూసెన్స్ సీజన్ 1’.. ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సరికొత్త వెబ్ ఒరిజినల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫ్లాట్‌ఫామ్స్‌లో ఓ తుపానులా ప్రభంజనం సృష్టిస్తోంది. గ్రిప్పింగ్ నెరేషన్, ఆలోచననను రేకెత్తించే కథాంశంతో రూపొందిన ఈ వెబ్ సిరీస్ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటోంది. ఈ అసాధారణ విజయాన్ని సాధించిన సందర్భంగా ‘న్యూసెన్స్’ సక్సెస్‌మీట్‌ను చిత్ర యూనిట్ నిర్వహించింది. ఈ సిరీస్‌కు తమదైన నటన, సాంకేతికతతో తిరుగులేని విజయాన్ని అందించిన టీమ్ ఈవెంట్‌లో పాల్గొంది.
న్యూసెన్స్ సీజన్ 1 విషయానికి వస్తే.. 1990-2000 దశకంలో ఏపీలోని మదనపల్లిలోని స్ట్రింగర్స్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది. మన సమాజంలో మీడియాకున్న ప్రాధాన్యతలపై ప్రశ్నలను లేవనెత్తిందీ సిరీస్. వార్తలను తెలియజేయటం, సంచలనాత్మక వార్తల ప్రభావం వంటి అంశాలను ఈ సిరీస్‌లో చూపించే ప్రయత్నం చేశారు.
దర్శకుడు శ్రీప్రవీణ్ మాట్లాడుతూ ‘‘న్యూసెన్స్’ సిరీస్‌ను అందరం ఎంతో ప్రేమించి చేశాం. ఆ కారణంగానే ఇంతటి అపూర్వమైన విజయం దక్కింది. అన్ని వర్గాల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఆహా, పీపుల్ మీడియా వారితో కలిసి వర్క్ చేయటం గొప్ప అనుభూతినిచ్చింది. వారు అందించిన సహయ సహకారాలతోనే మేము అనుకున్న కథను.. అనుకున్నట్లు తెరకెక్కించగలిగాం’ అన్నారు. టీమ్ అంతా పాల్గొన్న ఈ సక్సెస్‌మీట్ అద్భుతంగా జరిగింది. ఇదే సందర్భంలో ఫ్యాన్స్ కోసం మరో ఆసక్తికరమైన విషయాన్ని తెలియజేశారు. మరికొన్ని వారాల్లోనే ‘న్యూసెన్స్’ సీజన్ 2ను అందిస్తామని మేకర్స్ తెలియజేశారు. మరో ఆసక్తికరమైన, ఆలోచనను రేకెత్తించేలా ఉత్కంఠభరితమైన కథాంశంతో ముందుకు వస్తామని ఈ సందర్భంగా టీమ్ తెలియజేసింది.
తెలుగు రాష్ట్రాల్లో ఆహా నెం1 స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫామ్‌గా దూసుకెళ్తోంది. అద్భుతమైన ఎంటర్‌టైన్మెంట్‌ను అందిస్తూ సరికొత్త బెంచ్ మార్క్‌లను క్రియేట్ చేస్తోంది. న్యూసెన్స్ విషయానికి వస్తే గ్రిప్పింగ్ నెరేషన్, దానికి తగ్గ పెర్ఫామెన్స్‌లు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తిరుగులేని క్వాలిటీ, ఎంటర్‌టైన్మెంట్‌ను ప్రేక్షకులకు అందిస్తూ ఆహా తన ప్రామిస్‌ను నిలబెట్టుకుంటోంది.
న్యూ సెన్సేషనల్ హిట్ తెలుగు వెబ్ సిరీస్ ‘న్యూసెన్స్ సీజన్ 1’ను కేవలం ఆహాలో మాత్రమే అందుబాటులో ఉంది. సో.. ఆహాను ట్యూన్ చేసుకోవటం మరచిపోవద్దు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..