Upcoming Movies OTT: ఈవారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాలు ఇవే.. ఈ రెండు చిత్రాలను కచ్చితంగా చూడాల్సిందే..

|

May 28, 2024 | 7:45 AM

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన గం గం గణేశా, కార్తికేయ నటించిన భజే వాయు వేగం సినిమా రాబోతుంది. ఇప్పుడు ఈ మూడు చిత్రాల యూనిట్స్ ప్రమోషన్స్ వేగంగా నిర్వహిస్తున్నాయి. మరోవైపు ఓటీటీలోనూ కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ సందడి ఉండనుంది. ఈ వారం ఏకంగా 19 సినిమాలు ఓటీటీలో రిలీజ్ కాబోతున్నాయి.

Upcoming Movies OTT: ఈవారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాలు ఇవే.. ఈ రెండు చిత్రాలను కచ్చితంగా చూడాల్సిందే..
Panchayat
Follow us on

ఈవారం థియేటర్లలో చిన్న సినిమాల సందడి స్టార్ట్ కానుంది. మొన్నటివరకు అసలైన ఎంటర్టైన్మెంట్ కోసం వెయిట్ చేసిన మూవీ లవర్స్ కోసం ఈసారి యంగ్ హీరోస్ రెడీ అయ్యారు. చాలా రోజులుగా సైలెంట్ అయిన థియేటర్లలో ఇప్పుడు మూడు సినిమాలు విడుదల కాబోతున్నాయి. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన గం గం గణేశా, కార్తికేయ నటించిన భజే వాయు వేగం సినిమా రాబోతుంది. ఇప్పుడు ఈ మూడు చిత్రాల యూనిట్స్ ప్రమోషన్స్ వేగంగా నిర్వహిస్తున్నాయి. మరోవైపు ఓటీటీలోనూ కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ సందడి ఉండనుంది. ఈ వారం ఏకంగా 19 సినిమాలు ఓటీటీలో రిలీజ్ కాబోతున్నాయి. మరీ అవెంటో తెలుసుకుందామా.

ఈవారం ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో మొత్తం 19 సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. కానీ ఇటీవల హిందీలో సూపర్ హిట్ అయిన రెండు చిత్రాలపైనే ఇప్పుడు అందరి ఫోకస్ ఉంది. అవే పంచాయత్, వీర్ సావర్కర్. ఇటీవల థియేటర్లలో విడుదలైన ఈ రెండు సినిమాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. భారీ తారాగణం లేకపోయినా సరికొత్త కంటెంట్‏తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక వీటితోపాటు తెలుగు, తమిళం, హిందీ భాషలలోని పలు సినిమాలు విడుదలవుతున్నాయి.

నెట్ ఫ్లిక్స్..
రైజింగ్ వాయిసెస్.. స్పానిష్ సిరీస్.. మే 31.
లంబర్ జాక్ ద మానస్టర్.. జపనీస్ మూవీ.. జూన్ 01
ఏ పార్ట్ ఆఫ్ యూ .. స్వీడిష్ సినిమా.. మే 31.
ఎరిక్.. ఇంగ్లీష్ సిరీస్.. మే 30
గీక్ గర్ల్.. ఇంగ్లీష్ సిరీస్.. మే 30
ద లైఫ్ యూ వాంటెడ్.. ఇటాలియన్ సిరీస్.. మే 29

జియో సినిమా..
ద లాస్ట్ రైఫిల్ మ్యాన్.. ఇంగ్లీష్.. మే 31
ఇల్లీగన్ సీజన్ 3.. హిందీ.. మే 29
లా అండ్ ఆర్డర్ టొరంటో.. ఇంగ్లీష్.. మే 31
ఏలీన్.. ఇంగ్లీష్.. జూన్ 1
దేద్ బిగా జమీన్.. హిందీ.. మే 31

అమెజాన్ ప్రైమ్..
పంచాయత్ సీజన్ 3.. హిందీ.. మే 28

హాట్ స్టార్..
కామ్డేన్.. ఇంగ్లీష్.. మే 29
ద ఫస్ట్ ఓమన్.. ఇంగ్లీష్.. మే 30
ఉప్పు పులి కారమ్.. తమిళ్.. మే 30
జిమ్ హెన్సన్ ఐడియా మ్యాన్.. ఇంగ్లీష్.. 3 31

జీ5..
స్వాతంత్ర్య వీర్ సావర్కర్.. హిందీ.. మే 28
హౌస్ ఆఫ్ లైన్.. హిందీ.. మే31

సైనా ప్లే..
పొంబలై ఒరుమై.. మలయాళీ.. మే 31