థియేటర్లలతోపాటు.. ఇటు ఓటీటీలకు సినీప్రియుల ఆదరణ లభిస్తోంది. చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాలు.. ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ డిజిటల్ ప్లాట్ ఫామ్ పై చూసేందుకు అడియన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. ఇక వారం వారం ఓటీటీల్లో పలు చిత్రాలు ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఎప్పటిలాగే ఈ వారం సైతం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు పలు సినిమాలు విడుదల కాబోతున్నారు. ఈ శుక్రవారం (సెప్టెంబర్ 1న) సమంత, విజయ్ దేవరకొండ జంటగా నటించిన ఖుషీ చిత్రం రిలీజ్ కాబోతుంది. ఈ లవ్ రొమాంటిక్ డ్రామా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా కాకుండా అంతగా బజ్ క్రియేట్ అయిన చిత్రాలు లేవు. కానీ ఈవారం ఓటీటీల్లో మాత్రం ఏకంగా 22 కొత్త చిత్రాలు, వెబ్ సిరీస్ విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి.
తెలుగుతోపాటు.. పలు భాషల్లో అలరించేందుకు 20కిపైగా సినిమాలు రెడీగా ఉన్నాయి. అయితే ఇందులో తెలుగు స్ట్రెయిట్ మూవీస్ మాత్రం లేవు. అలాగే కొన్ని వెబ్ సిరీస్ మాత్రం స్ట్రీమింగ్ కానున్నాయి. ఇంతకీ అవెంటో తెలుసుకుందామా.
డిస్నీ ప్లస్ హాట్ స్టార్..
1. ఇండియానా జోన్స్ అండ్ ద డయిల్ ఆఫ్ డెస్టినీ – ఇంగ్లీష్ – ఆగస్ట్ 29
2. NCT 127: ద లాస్ట్ బాయ్స్ – కొరియన్ సిరీస్ – ఆగస్ట్ 30
3. ద ప్రీలాన్సర్ – హిందీ – సెప్టెంబర్ 1
సోనీ లివ్..
1. స్కామ్ 2003: ద తెల్గి స్టోరీ – తెలుగు డబ్బింగ్ – సెప్టెంబర్ 1
అమెజాన్ ప్రైమ్..
1. ద వీల్ ఆఫ్ టైమ్ సీజన్ 2 – ఇంగ్లీష్ – సెప్టెంబర్ 1
నెట్ ఫ్లిక్స్..
1. మిస్ అడ్రినలిన్ : ఏ టేల్ ఆఫ్ ట్విన్ – స్పానిష్ – ఆగస్ట్ 30
2. లైవ్ టూ 100 : సీక్రెట్ ఆఫ్ ద బ్లూ జోన్స్ – ఇంగ్లీష్ – ఆగస్ట్ 30
3. చూజ్ లవ్ – ఇంగ్లీష్ సినిమా – ఆగస్ట్ 31
4. వన్ పీస్ – ఇంగ్లీష్ – ఆగస్ట్ 31
5. ఏ డే అండ్ ఏ హాఫ్ – స్వీడిష్ – సెప్టెంబర్ 01
6. డిసెన్ చాంట్ మెంట్ : పార్ట్ 5 – ఇంగ్లీష్ – సెప్టెంబర్ 1
7. ఫ్రైడే నైట్ ప్లాన్ – హిందీ – సెప్టెంబర్ 1
8. హ్యాపీ ఎండింగ్ – డచ్ మూవీ – సెప్టెంబర్ 1
9. లవ్ ఈజ్ బ్లైండ్ : ఆఫ్టర్ ద అల్టర్ సీజన్ 4 – ఇంగ్లీష్ – సెప్టెంబర్ 1
10. ఈజ్ షఈ ద ఊల్ఫ్ – జపనీస్ సిరీస్ – సెప్టెంబర్ 3
జీ 5..
1. బియే బిబ్రాత్ – బెంగాలీ సినిమా – సెప్టెంబర్ 1
2. డీడీ రిటర్న్స్ – తెలుగు డబ్బింగ్ సినిమా – సెప్టెంబర్ 1
హెచ్ఆర్ ఓటీటీ
1. నీరజ – మలయాళ సినిమా – ఆగస్ట్ 28
2. లవ్ ఫుల్లీ యువర్స్ వేదా – మలయాళ సినిమా – ఆగస్ట్ 29
3. నానుమ్ పిన్నోరు నానుమ్ – మలయాళ సినిమా – ఆగస్ట్ 30
4. వివాహ ఆహ్వానం – మలయాళ సినిమా – సెప్టెంబర్ 02
బుక్ మై షో..
1. ద అల్లేస్ – అరబిక్ సినిమా – సెప్టెంబర్ 1
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.