ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాంలో ఆహాలో తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 1 సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. మ్యూజిక్ డైరెక్టర్ థమన్, సింగర్ కార్తిక్, హీరోయిన్ నిత్యా మీనన్ న్యాయనిర్ణేతలుగా.. సింగర్ శ్రీరామచంద్ర హోస్ట్‌గా వ్యవహరించిన సీజన్ 1కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలోనే ఇటీవల సీజన్ 2 స్టార్ట్ చేశారు మేకర్స్. అయితే ఈసారి జడ్జీలుగా తమన్, సింగర్ కార్తిక్ కొనసాగుతుండగా.. నిత్యా స్థానంలోకి సింగర్ గీతా మాధురి చేరిపోయారు. అలాగే శ్రీరామచంద్ర హోస్ట్ గా వ్యవహిరిస్తున్నారు. ఇప్పటికే పలువురు సింగర్స్ తమ ప్రతిభ కనబరచగా.. తాజాగా వేదికపైకి అడుగుపెట్టిన లాస్య ప్రియా తన గాత్రంతో జడ్జీలను మైమరపించింది.
తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 వేదికపైకి అడుగుపెట్టిన లాస్య ప్రియ అలెగ్రా పాటతో అదరగొట్టింది. అంతేకాదు.. లాస్య సింగింగ్ తర్వాత తమన్, సింగర్ కార్తిక్ మధ్య సరదా సంభాషణ నడిచినట్లుగా తెలుస్తోంది. చివరకు లాస్యకు సింగర్ కార్తిక్ ఆటోగ్రాఫ్ కూడా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేయగా.. సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.