
గత వారం ఓటీటీలోకి పలు కొత్త సినిమాలు, ఆసక్తికర వెబ్ సిరీస్ లు వచ్చాయి. తెలుగుతో పాటు వివిధ భాషలకు చెందిన చిత్రాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చాయి. అయితే ఇందులో ఒక తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఓటీటీ ఆడియెన్స్ ను తెగ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రం ఆగస్టు 23, 2024న థియేటర్లలో విడుదలైంది. సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ కావడంతో ఓ మోస్తరుగా ఆడింది. ఐఎమ్ డీబీలోనూ 8.6/10 రేటింగ్ అందుకుంది. అయితే పేరున్న నటీనటులు లేకపోవడంతో లాంగ్ రన్ కొనసాగించలేకపోయింది. థియేటర్లలో యావరేజ్ గా నిలిచిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ సుమారు ఏడాది తర్వాత గత వారమే ఓటీటీలోకి వచ్చింది. ఇప్పుడీ సినిమాను ఓటీటీ ఆడియెన్స్ ఎగబడి చూస్తున్నారు. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. పోలీస్ స్టేషన్ సమీపంలో తల లేని శవం కనిపించే సీన్ తో మూవీ స్టార్ట్ అవుతుంది. ఈ శవం ఎవరిది ? హంతకుడు ఎవరు ? పోలీస్ స్టేషన్ లో ఎందుకు శవాన్ని వదిలాడు? అనే ప్రశ్నలతో పోలీసులు కేసును దర్యాప్తు ను ముమ్మరం చేస్తారు. కట్ చస్తే.. స్టోరీ మూడు నెలలు వెనక్కు వెళుతుంది.
చైత్ర అనే అమ్మాయి ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. అమెరికా నుంచి తన స్వగ్రామానికి తిరిగి వస్తుంది. సూర్య అనే యువకుడిని ప్రేమిస్తుంది. అతను కూడా ఆమెను ప్రాణంగా ప్రేమిస్తాడు. దీనికి సమాంతరంగానే గౌతమ్ అనే యువకుడి కథ కూడా రన్ అవుతుంటుంది. జులాయిగా తిరిగే గౌతమ్ జీవితంలో కొన్ని షాకింగ్ సీక్రెట్స్ ఉంటాయి. ఇవి ఒక హత్యకు దారితీస్తాయి. ఇది తల లేని శవానికి కనెక్ట్ అవుతుంది. మరి ఆ మృతదేహం ఎవరిదో పోలీసులు గుర్తించారా? ఆ హత్య ఎవరు చేసారు ? ఎందుకు చేశారు ? పోలీసుల దర్యాప్తులో తేలిందేంటి? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీని చూడాల్సిందే.
ఎవరూ ఊహించని ట్విస్టులు, షాకింగ్ క్లైమాక్స్ తో ఎండ్ అయ్యే సినిమా పేరు బ్రహ్మవరం పీఎస్ పరిధిలో. ఇమ్రాన్ శాస్త్రి తెరకెక్కించిన ఈ తెలుగు మూవీలో మూవీలో గురు చరణ్, సూర్య శ్రీనివాస్, స్రవంతి బెల్లంకొండ, బలగం రూప లక్ష్మీ, యాంకర్ హర్షిణి, సమ్మెట గాంధీ, జీవా, ప్రేమ్ సాగర్, రుద్ర తిప్పే స్వామి తదితరులు నటించారు. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారికి ఈ మూవీ ఒక మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.