సినిమా ప్రేమికుల ఎదురుచూపులకు ఫుల్ స్టాప్ పడింది. ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న బ్లాక్ బస్టర్ మూవీ హనుమాన్ ఓటీటీలోకి వచ్చేసింది. శనివారం (మార్చి16) హిందీ వెర్షన్ మాత్రమే స్ట్రీమింగ్ కు వచ్చినా తెలుగు స్ట్రీమింగ్ పై ఎలాంటి అప్ డేట్ రాలేదు. దీంతో సినిమా ప్రేమికులు హనుమాన్ టీమ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగులో ముందుగా తీసుకురాకుండా హిందీలో ఎలా రిలీజ్ చేస్తారంటూ మండి పడ్డారు. తెలుగు వెర్షన్ కూడా ఓటీటీలో రిలీజ్ చేయాలంటూ తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకున్న జీ5 ఓటీటీపై సోషల్ మీడియా వేదికగా అసహనం వ్యక్తం చేశారు. మరి వీరి వినతులను పరిగణనలోకి తీసుకుందేమో జీ5 ఓటీటీ సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చింది. ఆదివారం (మార్చి 17) ఉదయమే హనుమాన్ తెలుగు వెర్షన్ ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం జియో సినిమాలో హనుమాన్ హిందీ వెర్షన్ స్ట్రీమింగ్ కు అందుబాటులో ఉండగా.. మరో ప్రముఖ ఓటీటీ ప్లాట్ పామ్ జీ5లో తెలుగు వెర్షన్ చూడవచ్చు.
యంగ్ హీరో తేజ సజ్జా, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో రూపొందిన సినిమా ‘హనుమాన్’ ఏకంగా రూ. 300 కోట్లు రాబట్టింది. భారీ పోటీ మధ్య సంక్రాంతి కానుకగా 12న విడుదలైన హనుమాన్ సినిమా స్టార్ హీరోల సినిమాలకు సైత అధిగమించింది. ఇందులో సినిమాలో అమృతా అయ్యర్ హీరోయిన్ గా నటించింది. వరలక్ష్మి శరత్ కుమార్ హీరో సోదరి పాత్రలో ఆకట్టుకుంది. ఇక వాన ఫేమ్ వినయ్ రాయ్ స్టైలిష్ విలన్ గా మెప్పించాడు. సముద్ర ఖని, వెన్నెల కిశోర్, జబర్దస్త్ శీను, తదితరులు ప్రధాన పాత్రల్లో మెరిశారు. ప్రైమ్ షో ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి హనుమాన్ సినిమాను నిర్మించారు. మొత్తానికి థియేటర్లలో రిలీజైన 66 రోజుల తర్వాత హనమాన్ సినిమా ఓటీటీలోకి అడుగుపెట్టిందన్నమాట. మరి ఇంకెందుకు లేటు.. థియేటర్లలో చూడనివారు, అలాగే మళ్లీ చూడాలనుకునేవారు ఎంచెక్కా ఓటీటీలో హనుమాన్ విన్యాసాలను చూసేయండి.
The most awaited movie HanuMan is now streaming on ZEE5. Subscribe and watch it now! 🍿 @PrasanthVarma @Niran_Reddy @Actor_Amritha @varusarath5 @VinayRai1809 @Chaitanyaniran @AsrinReddy @Primeshowtweets @tipsofficial @tipsmusicsouth @ThePVCU @RKDStudios #HanuMan #HanuManOnZEE5 pic.twitter.com/zRd0M4cEwR
— ZEE5 Telugu (@ZEE5Telugu) March 17, 2024
HanuMan is now streaming on @ZEE5Telugu 😊@tejasajja123 @Niran_Reddy @Actor_Amritha @varusarath5 @VinayRai1809 @Chaitanyaniran @AsrinReddy @Primeshowtweets @tipsofficial @tipsmusicsouth @ThePVCU @RKDStudios #HanuMan #HanuManOnZEE5 pic.twitter.com/PLf0lF3Lfw
— Prasanth Varma (@PrasanthVarma) March 17, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి