కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ నటించిన చిత్రం ‘మార్క్ ఆంటోని’. గత కొన్నేళ్లుగా వరుసగా పరాజయాలు ఎదుర్కొంటోన్న విశాల్ ఈ మూవీతో గ్రేట్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ యాక్షన్ మూవీ ఏకంగా వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. సెప్టెంబర్ 15న విడుదలైన మార్క్ ఆంటోని సినిమాకు తమిళంతో పాటు తెలుగులోనూ భారీ వసూళ్లు రావడం విశేషం. ఇప్పుడీ సినిమా ఓటీటీలోనూ అదరగొడుతోంది.అక్టోబర్ 13వ తేదీన ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో విశాల్ సినిమా స్ట్రీమింగ్‌కు అందుబాబులోకి వచ్చింది. తమిళంతో పాటు తెలుగు భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోరికార్డు స్థాయిలో వ్యూస్ సొంతం చేసుకుంటోన్న మార్క్ ఆంటోని సినిమా ఇండియాలోనే టాప్ ట్రెండింగ్‌లో నిలవడం విశేషం. ఈ విషయాన్ని హీరో విశాల్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. తన సినిమాకు సూపర్ రెస్పాన్స్ రావడంపై హర్షం వ్యక్తం చేశాడీ యాక్షన్ హీరో. ‘మార్క్ ఆంటోనీ సినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో కూడా అదరగొట్టడం చాలా సంతోషంగా ఉంది. అమెజాన్ ప్రైమ్‍లో ఇండియాలోనే నంబర్ 1గా ట్రెండ్ అవుతోంది. అన్‍లిమిటెడ్ ఎంటర్‌టైన్‍మెంట్‍ను ముఖ్యంగా నా ఫేవరెట్ సిల్క్ స్మితను మీ ఇంట్లో నుంచే చూసి ఎంజాయ్ చేయండి’ అని ట్వీట్ చేశాడు విశాల్.
విశాల్ మార్క్ ఆంటోనీ చిత్రంలో సిల్క్ స్మిత పాత్ర హైలెట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ రోల్‌ను ప్రముఖ నటి విష్ణు ప్రియ గాంధీ పోషించారు. ఇందులో ఆమె మేకోవర్ అచ్చం సిల్క్ స్మితలాగే ఉంది. మార్క్ ఆంటోనీ సినిమా విజయంలో సిల్క్ స్మిత రోల్ కీలక పాత్ర పోషించింది. ఇక సినిమా విషయానికొస్తే.. అధిక్ రవిచంద్రన్ తెరకెక్కించిన మార్క్ ఆంటోని సినిమాలో ప్రముఖ దర్శకుడు, నటుడు ఎస్ జే సూర్య సెకెండ్ లీడ్ రోల్ పోషించారు. రీతూ వర్మ, అభినయ హీరోయిన్లుగా మెప్పించగా కమెడియన్ సునీల్, సెల్వరాఘవన్ వైజీ మహేంద్రన్, మీరా కృష్ణన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. అలాగే విశాల్ నటన, ఎస్ జే సూర్య కామెడీ సినిమాకు హైలెట్‌గా నిలిచాయి. మినీ స్టూడియో బ్యానర్‌పై ఎస్ వినోద్ కుమార్ మార్క్ ఆంటోని సినిమాను నిర్మించారు. జీవీ ప్రకాశ్ స్వరాలు సమకూర్చారు. ఈ సినిమాలో విశాల్ డ్యూయ్ రోల్ పోషించారు. అలాగే డిఫరెంట్ గెటప్పులలో కనిపించి ఆకట్టుకున్నారు. మరి థియేటర్లలో మార్క్ ఆంటోని సినిమాను మిస్ అయ్యారా? అయితే ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.
Happy to see #MarkAntony killing it in Ott platform too. Trending no 1 in Amazon Prime.
Enjoy the unlimited entertainment, especially my favourite Silk Smitha scene in your own homes now. God Bless pic.twitter.com/RXTCaQJNQY
— Vishal (@VishalKOfficial) October 14, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.