Janaka Aithe Ganaka OTT: ఓటీటీలోకి వచ్చేసిన సుహాస్ లేటెస్ట్ మూవీ.. మిడిల్ క్లాస్ వాళ్లు అసలు మిస్ అవ్వద్దు

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో సుహాస్ నటించిన లేటెస్ట్ సినిమా జనక అయితే గనక. టైటిల్ తోనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన ఈ మూవీ దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు ఓటీటీ ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించేందుకు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ మీదకు వచ్చేసింది.

Janaka Aithe Ganaka OTT: ఓటీటీలోకి వచ్చేసిన సుహాస్ లేటెస్ట్ మూవీ.. మిడిల్ క్లాస్ వాళ్లు అసలు మిస్ అవ్వద్దు
Janaka Aithe Ganaka Movie
Follow us
Basha Shek

|

Updated on: Nov 08, 2024 | 11:34 AM

టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ నటించిన మరో డిఫరెంట్ సినిమా జనక అయితే గనక. సందీప్ రెడ్డి బండ్ల తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో సంగీర్తన విపిన్ కథానాయికగా నటించింది. దిల్ రాజు బ్యానర్ పై హర్షిత్ రెడ్డి, హన్షిత ఈ సినిమాను నిర్మించారు. టైటిల్, టీజర్, ట్రైలర్ తో రిలీజ్ కు ముందే ఈ సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. ప్రమోషన్లు కూడా గట్టిగానే నిర్వహించారు. అందుకు తగ్గట్టుగానే దసరా కానుకగా అక్టోబర్ 12న విడుదలైన జనక అయితే గనక మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కాన్సెప్ట్ బోల్డ్ గా ఉన్నా ఎలాంటి అసభ్యతకు తావులేకుండా ఈ సినిమాను తెరకెక్కించారని రివ్యూలు వచ్చాయి. ఇంటిల్లిపాది చూడాల్సిన సినిమా అంటూ ప్రశంసలు వచ్చాయి. ఇక ఎప్పటిలాగే సుహాస్ తన యాక్టింగ్ తో అదరగొట్టేశాడని కాంప్లిమెంట్స్ వినిపించాయి. ఇలా థియేటర్లలో ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించిన జనక అయితే గనక ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. నవంబర్ 8 నుంచి సుహాస్ సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నట్లు ఇది వరకే అధికారికంగా ప్రకటించింది. అందుకు తగ్గట్టుగానే శుక్రవారం అర్ధరాత్రి నుంచే జనగ అయితే గనక మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ‘మిడిల్ క్లాస్ గోల్డెన్ టిప్స్ కావాలా? అయితే ఆహాలో జనక అయితే గనక చూసేయండి’ అంటూ ఈ అప్డేట్ ను షేర్ చేసింది ఆహా.

దిల్ రాజు సమర్పకుడిగా వ్యవహరించిన జనక అయితే గనక సినిమాలో గోపరాజు రమణ, వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్, మురళీ శర్మ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. బేబీ సినిమాతో ఫేమస్ అయిన విజయ్ బుల్గానిన్ ఈ సినిమాకు స్వరాలు సమకూర్చారు. ఇక మూవీ కథ విషయానికి వస్తే.. లైఫ్‌లో పూర్తిగా సెటిలవక ముందే పెళ్లి చేసుకున్నఒక మిడిల్ క్లాస్ యువకుడు.. పిల్లలు వద్దనుకుంటాడు. భార్యాభర్తలిద్దరూ ఫ్యామిలీ ప్లానింగ్ పాటిస్తారు. అయితే అనుకోకుండా ఓ రోజు అతని భార్య గర్భం దాలుస్తుంది. దీనికి కారణం కండోమ్ చినిగిపోవడమే అని తెలుసుకొని ఆ కంపెనీపై కేసు వేస్తాడు. ఆ తర్వాత ఏమైందన్నదే జనక అయితే గనక సినిమా.

ఇవి కూడా చదవండి

ఆహాలో స్ట్రీమింగ్..

వీకెండ్ లో మంచి ఎంటర్ టైన్మెంట్ కావాలనుకుంటే ఈ సినిమాను అసలు మిస్ అవ్వద్దు.

జనక అయితే గనక ట్రైలర్..

Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు