Kotabommali PS OTT: అఫీషియల్‌.. ఓటీటీలోకి శ్రీకాంత్‌ కోట బొమ్మాళి పీఎస్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే?

|

Dec 31, 2023 | 2:53 PM

మలయాళ బ్లాక్‌ బస్టర్‌ నాయట్టు మూవీని తెలుగు ప్రేక్షకులకు అనుగుణంగా గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌‌పై బన్నీ వాస్, విద్యా కొప్పినీడి విద్య సంయుక్తంగా రూపొందించారు. ననవంబర్‌ 24న థియేటర్లలో విడుదలైన కోట బొమ్మాళి పీఎస్‌ సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఆసక్తికరమైన కథా, కథనాలు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌కు తోడు గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే కోట బొమ్మాళి పీఎస్‌ విజయంలో కీలక పాత్ర పోషించాయి

Kotabommali PS OTT: అఫీషియల్‌.. ఓటీటీలోకి శ్రీకాంత్‌ కోట బొమ్మాళి పీఎస్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే?
Kotabommali PS Movie
Follow us on

సీనియర్‌ నటుడు శ్రీకాంత్‌ చాలా రోజుల తర్వాత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం కోట బొమ్మాళి పీఎస్‌. తేజ మార్ని తెరకెక్కించిన ఈ పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌లో వరలక్ష్మి శరత్‌ కుమార్‌, శివాజీ రాజశేఖర్‌, రాహుల్‌ విజయ్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. మలయాళ బ్లాక్‌ బస్టర్‌ నాయట్టు మూవీని తెలుగు ప్రేక్షకులకు అనుగుణంగా గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌‌పై బన్నీ వాస్, విద్యా కొప్పినీడి విద్య సంయుక్తంగా రూపొందించారు. ననవంబర్‌ 24న థియేటర్లలో విడుదలైన కోట బొమ్మాళి పీఎస్‌ సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఆసక్తికరమైన కథా, కథనాలు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌కు తోడు గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే కోట బొమ్మాళి పీఎస్‌ విజయంలో కీలక పాత్ర పోషించాయి. అన్నిటికీ మించి సీనియర్‌ హీరో శ్రీకాంత్‌ చాలా రోజుల తర్వాత ఒక మంచి సాలిడ్‌ హిట్‌ లభించింది. థియేటర్లలో సూపర్‌ హిట్‌గా నిలిచిన కోట బొమ్మాళి పీఎస్‌ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆహా శ్రీకాంత్‌ సినిమా డిజిటల్‌ స్ట్రీమింగ్‌ హక్కులను సొంతం చేసుకుంది. తాజాగా కోట బొమ్మాళి పీఎస్‌ ఓటీటీ విడుదలకు సంబంధించి సరికొత్త అప్‌డేట్‌ ఇచ్చారు మేకర్స్‌. సంక్రాంతి పండగకు కోట బొమ్మాళి పీఎస్‌ను ఓటీటీలోకి తీసుకురానున్నట్లు ఆహా కూడా అధికారికంగా ప్రకటించింది. అయితే కచ్చితమైన డేట్‌ ఎప్పుడనేది చెప్పలేదు.. కానీ సంక్రాంతికి మాత్రం ఓటీటీలోకి కోట బొమ్మాళి వస్తుందని క్లారిటీగా చెప్పేశారు.

‘రాజకీయ వ్యవస్థను, నాయకులను ప్రశ్నించి నిలదీసిన ముగ్గురు పోలీసుల కథ ఈ కథ… ఈ సంక్రాంతి కి, మీ ఆహలో!’ అంటూ కోట బొమ్మాళి నుంచి కొత్త పోస్టర్‌ను రిలీజ్‌ చేసింది ఆహా ఓటీటీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన యాస, భాషలకు తగ్గట్టుగా పొలిటికల్‌ థ్రిల్లర్గా కోట బొమ్మాళి పీఎస్‌ సినిమాను తెరకెక్కించారు డైరెక్టర్‌. సినిమా లోని లింగి లింగిడి సాంగ్‌ చార్ట్‌ బస్టర్‌గా నిలిచింది. సోషల్‌ మీడియాలో బాగా ట్రెండ్‌ అయ్యిందీ సాంగ్‌. ఇలా ఎన్నో విశేషాలున్న కోట బొమ్మళి పీఎస్‌ సినిమాను థియేటర్లలో మిస్‌ అయ్యారా? అయితే ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

సంక్రాంతికి ఆహాలో..

లింగి లింగిడి పాటకు శివానీ రాజశేఖర్ డ్యాన్స్..

కోట బొమ్మాళి పీఎస్‌ ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.