Aadikeshava OTT: ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చేసిన ఆది కేశవ.. వైష్ణవ్‌ తేజ్, శ్రీలీల మూవీని ఎక్కడ చూడొచ్చంటే?

ఎప్పటిలాగే వైష్ణవ్‌- శ్రీలీల క్యూట్‌ జోడీ యూత్‌ను ఆకట్టుకుంది. ఒకరికొకరు పోటీపడి వేసిన స్టెప్పులు ఫ్యాన్స్‌ను అలరించాయి. యాక్షన్‌ సీక్వెన్స్‌ కూడా బాగున్నాయని ప్రశంసలు వచ్చాయి. థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోని ఆదికేశవ ఇప్పుడు ఓటీటీలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వచ్చింది.

Aadikeshava OTT: ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చేసిన ఆది కేశవ.. వైష్ణవ్‌ తేజ్, శ్రీలీల మూవీని ఎక్కడ చూడొచ్చంటే?
Aadikeshava Movie

Updated on: Dec 22, 2023 | 5:26 PM

మెగా హీరో పంజా వైష్ణవ్‌ తేజ్‌, శ్రీలీల జంటగా నటించిన లేటెస్ట్‌ యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌ ఆది కేశవ. ఇరాట్ట సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రముఖ మలయాళ నటుడు జోజు జార్జ్‌ ఇందులో విలన్‌గా నటించాడు. నవంబర్‌ 24న థియేటర్లలోకి అడుగు పెట్టిన ఆది కేశవ కేవలం మాస్‌ జనాలనే మెప్పించింది. రోటీన్‌ కథ, కథనాలు, సినిమాలో హింస ఎక్కువగా ఉండడంతో సగటు సినీ ప్రేక్షకులు ఆది కేశవపై పెదవి విరిచారు. అయితే ఎప్పటిలాగే వైష్ణవ్‌- శ్రీలీల క్యూట్‌ జోడీ యూత్‌ను ఆకట్టుకుంది. ఒకరికొకరు పోటీపడి వేసిన స్టెప్పులు ఫ్యాన్స్‌ను అలరించాయి. యాక్షన్‌ సీక్వెన్స్‌ కూడా బాగున్నాయని ప్రశంసలు వచ్చాయి. థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోని ఆదికేశవ ఇప్పుడు ఓటీటీలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వచ్చింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌ వైష్ణవ్‌ తేజ్‌ మూవీ డిజిటల్‌ స్ట్రీమింగ్ రైట్స్‌ను సొంతం చేసుకుంది. శుక్రవారం (డిసెంబర్‌ 22) అర్ధరాత్రి నుంచే ఆది కేశవ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది.

శ్రీకాంత్ ఎన్ రెడ్డి పక్కా ఊర మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌ గా ఆదికేశవ ను రూపొందించారు. సుమన్‌, రాధిక శరత్ కుమార్‌, సదా, అపర్ణా దాస్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ కింద నాగ వంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మించారు. జీవీ ప్రకాశ్‌ కుమార్‌ స్వరాలు సమకూర్చారు. ఇటీవల థియేటర్లలో హిట్‌ కానీ సినిమాలు కూడా ఓటీటీలో మంచి రెస్పాన్స్‌ దక్కించుకుంటున్నాయి. మరి వైష్ణవ్‌ తేజ్‌, శ్రీలీల ఆది కేశవ కూడా ఈ లిస్టులోకి చేరుతుందా? లేదా? అన్నది చూడాలి మరి.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.