AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Curry & Cyanide: ఒక మహిళ.. ఆరు హత్యలు.. ఓటీటీలోకి వచ్చేసిన రియల్ క్రైమ్ స్టోరీ.. ఎక్కడ చూడొచ్చంటే

థియేటర్స్ లో సినిమాలను ఎంజాయ్ చేసిన ప్రేక్షకులు ఓటీటీలోనూ సినిమాలు చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. బడా హీరోల సినిమాలే కాదు చిన్న సినిమాలు కూడా ఓటీటీలో రిలీజై ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పటుకే చాలా సినిమాలు ఓటీటీలో అలరిస్తున్నాయి. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ సినిమా కూడా ఓటీటీలో రిలీజ్ అయ్యింది.

Curry & Cyanide: ఒక మహిళ.. ఆరు హత్యలు.. ఓటీటీలోకి వచ్చేసిన రియల్ క్రైమ్ స్టోరీ.. ఎక్కడ చూడొచ్చంటే
Curry & Cyanide
Rajeev Rayala
|

Updated on: Dec 22, 2023 | 6:09 PM

Share

ఇప్పటికే ఓటీటీలో చాలా సినిమా ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. కొత్త సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అయిన నెలరోజులకు ఓటీటీలో దర్శనమిస్తున్నాయి. థియేటర్స్ లో సినిమాలను ఎంజాయ్ చేసిన ప్రేక్షకులు ఓటీటీలోనూ సినిమాలు చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. బడా హీరోల సినిమాలే కాదు చిన్న సినిమాలు కూడా ఓటీటీలో రిలీజై ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పటుకే చాలా సినిమాలు ఓటీటీలో అలరిస్తున్నాయి. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ సినిమా కూడా ఓటీటీలో రిలీజ్ అయ్యింది. ఓ నిజ జీవిత కథ ఆధారంగా తీసిన డాక్యుమెంటరీ ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ అయ్యింది. ఓ ఇంట్రెస్టింట్ క్రైం థ్రిల్లర్ ఇప్పుడు ఓటీటీలోకివచ్చింది.

ఆ సినిమానే కర్రీ అండ్‌ సైనైడ్‌.. ఇది ఓ రియల్ ఇన్సిడెంట్ కు సంబంధించిన కథ. నిజ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో ఓ మహిళ పద్నాలుగేళ్లలో ఆరు హత్యలు చేసింది. ఈ దారుణమైన సంఘటన కేరళ లో జరిగింది. ఓ మహిళ తన కుటుంబసభ్యులనే హతమార్చింది. జూలీ జోసెఫ్‌ అనే మహిళ తెలివిగా ఆరుగురిని చంపేసింది.

అన్నింటిని అనుమానాస్పద మృతులుగా కట్టుకథలు అల్లింది. జూలీ జోసెఫ్‌  తన అత్తయ్యను, మామయ్యను, ఆతర్వాత ఆమె భర్త రాయ్‌ థామస్‌, ఆతర్వాత తన అత్తయ్య సోదరుడు మాథ్యూ, తన భర్త దగ్గరి బంధువైన షాజు జచారయ్య భార్య, ఏడాదిన్నర బిడ్డను చంపేసింది . ఆతర్వాత షాజు జచారయ్యను రెండో వివాహం చేసుకుంది. అయితే జూలీ జోసెఫ్‌ భర్త సోదరుడు అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. దాంతో చాలా విషయాలు బయట పడ్డాయి. ఆస్తి తనకు దక్కాలన్న అత్యాశతోనే అందరిని చంపిన జూలీ జోసెఫ్‌ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమా ఓటీటీలో రిలీజ్ అయ్యింది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మీ డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా?
మీ డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా?
మనసును కదిలించే జ్ఞాపకం.. విజయ్ వాహనాలకు 0277 నంబర్ ఎందుకంటే..
మనసును కదిలించే జ్ఞాపకం.. విజయ్ వాహనాలకు 0277 నంబర్ ఎందుకంటే..
మీ ముక్క ఆకారమే.. మీ క్యారెక్టర్ ఎలాంటిదో చెప్పేస్తుంది! ఎలా అంటే
మీ ముక్క ఆకారమే.. మీ క్యారెక్టర్ ఎలాంటిదో చెప్పేస్తుంది! ఎలా అంటే
ఎంత కష్టపడని పని చేసినా డబ్బు నిలవట్లేదా? కారణాలు ఇవే!
ఎంత కష్టపడని పని చేసినా డబ్బు నిలవట్లేదా? కారణాలు ఇవే!
D-Mart: డి-మార్ట్‌లో అత్యధిక జీతం పొందే ఉద్యోగి ఎవరు? ఆ జీతం ఎంతో
D-Mart: డి-మార్ట్‌లో అత్యధిక జీతం పొందే ఉద్యోగి ఎవరు? ఆ జీతం ఎంతో
ఆపరేషన్ సింధూర్‌లో ధ్వంసమైన జైష్ హెడ్ క్వార్టర్స్ పునర్నిర్మాణం!
ఆపరేషన్ సింధూర్‌లో ధ్వంసమైన జైష్ హెడ్ క్వార్టర్స్ పునర్నిర్మాణం!
గోల్డెన్ రాశులివే.. త్వరలో బంగారం కొనుగోలు, పెట్టుబడులకు బెస్ట్
గోల్డెన్ రాశులివే.. త్వరలో బంగారం కొనుగోలు, పెట్టుబడులకు బెస్ట్
ఒకప్పుడు ఈవీవీ, రాజేంద్రప్రసాద్‌లతో సినిమాలు.. ఇప్పుడు AP MLA
ఒకప్పుడు ఈవీవీ, రాజేంద్రప్రసాద్‌లతో సినిమాలు.. ఇప్పుడు AP MLA
సమ్మర్ హీట్‌కి గుడ్‌బై! 10°C కంటే తక్కువ ఉష్ణోగ్రతలున్న టాప్ ట్రా
సమ్మర్ హీట్‌కి గుడ్‌బై! 10°C కంటే తక్కువ ఉష్ణోగ్రతలున్న టాప్ ట్రా
యూట్యూబ్ నుంచి 30 లక్షల సంపాదన..
యూట్యూబ్ నుంచి 30 లక్షల సంపాదన..