మలయాళ సూపర్‌స్టార్ దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన సినిమా సీతారామం. ఫీల్ గుడ్ డైరెక్టర్‌గా పేరున్న హను రాఘవపూడి ఈ సినిమాను తెరకెక్కించారు. ఆగస్టు 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకుంది. తెలుగుతో సహా తమిళ్, మలయాళం, హిందీ భాషల్లోనూ విడుదలై భారీ కలెక్షన్లు రాబట్టింది. అన్ని భాషల్లో కలిపి రూ.50 కోట్ల మేర వసూళ్లు రాబట్టి నట్లు తెలుస్తోంది. కాగా యుద్ధం నేపథ్యంలో తెరకెక్కిన ఈ అందమైన ప్రేమకథలో నేషనల్ క్రష్ రష్మిక, సుమంత్ కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. కాగా సీతారామం సినిమా ఇప్పటికే అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా ఈ చిత్రం హిందీ వెర్షన్ ఓటీటీకి సంబంధించి బిగ్ అప్‌డేట్ వచ్చింది. ఈనెల 18 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు చిత్రబృందం వెల్లడించింది.
కాగా థియేటర్లు, డిజిటల్ స్ట్రీమింగ్‌లోనూ అదరగొట్టిన సీతారామం త్వరలోనే టీవీలోనూ ప్రసారం కానుంది. వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా స్టార్ మా లో ప్రసారం కానుంది. దీనికి సంబంధించి త్వరలో అధికారిక తేదీ వెలువడనుంది. ప్రతిష్ఠాత్మక వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్‌లపై అశ్వనిదత్ నిర్మించిన ఈ సినిమాలో నటుడు తరుణ్ భాస్కర్, భూమిక చావ్లా, వెన్నెల కిశోర్, సచిన్ ఖేడ్కర్, రుక్మిణి విజయభాస్కర్, గౌతమ్ మేనన్, మురళీ శర్మ, ప్రకాశ్ రాజ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. బాలీవుడ్ సంగీత ద్వయం విశాల్ చంద్రశేఖర్ అందించిన పాటలు ఇప్పటికీ వినిపిస్తున్నాయి. మరి హిందీలో సీతారామం సినిమాను చూడాలనుకునేవారు 18 వరకు వేచి చూడండి.
Kuch alag hi tha, uss zamane ka pyaar- Sita Ramam ka Pyaar. Dekhiye Sita Ramam ab Hindi me.
#SitaRamam #SitaRamamOnHotstar #SitaRamamHindi pic.twitter.com/PtxTS3hVL2— Disney+ Hotstar (@DisneyPlusHS) November 9, 2022
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..