OTT Movie: దేశాన్ని కుదిపేసిన ఘటన.. ఓటీటీ టాప్ ట్రెండింగ్‌లో రియల్ క్రైమ్ స్టోరీ.. తెలుగులోనూ చూడొచ్చు

ఈ మధ్యన నిజ జీవితం సంఘటల ఆధారంగా తెరకెక్కుతోన్న సినిమాలు, వెబ్ సిరీస్ లకు మంచి స్పందన వస్తోన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఓటీటీలో ఈ రియల్ స్టోరీలకు మంచి ఆదరణ దక్కుతోంది. అలా ఇప్పుడు ఓ రియల్ క్రైమ్ స్టోరీ ఓటీటీ టాప్ ట్రెండింగ్ లో దూసుకెళ్లుతోంది.

OTT Movie: దేశాన్ని కుదిపేసిన ఘటన.. ఓటీటీ టాప్ ట్రెండింగ్‌లో రియల్ క్రైమ్ స్టోరీ.. తెలుగులోనూ చూడొచ్చు
Delhi Crime Season 3 Web Series

Updated on: Nov 18, 2025 | 9:36 PM

గత వారం ఓటీటీల్లో చాలా సినిమాలే స్ట్రీమింగ్ కు  వచ్చాయి. తెలుగుతో పాటు వివిధ భాషలకు చెందిన సినిమాలు, వెబ్ సిరీస్ లు ఇప్పుడు ఓటీటీల్లో సందడి చేస్తున్నాయి. అయితే గత వారమే ఓటీటీలోకి వచ్చిన ఓ వెబ్ సిరీస్ ఇప్పుడు టాప్ ట్రెండింగ్ లో దూసుకెళ్లుతోంది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సిరీస్ ఇప్పుడు ఓటీటీ ఆడియెన్స్ ను తెగ ఆకట్టుకుంటోంది. ఆసక్తికరమైన కథ, కథనాలు, ఉత్కంఠ భరిత సన్నివేశాలు, అద్దిరిపోయే ట్విస్టులు ఓటీటీ ఆడియెన్స్ కు మంచి థ్రిల్ అందిస్తున్నాయి. కథ విషయానికి వస్తే.  2012 జనవరి 18న ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి 15 ఏళ్ల బాలిక అపస్మారక స్థితిలో ఉన్న రెండేళ్ల బాలికతో వచ్చింది. వైద్యులు బాలికను పరీక్షించగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాలిక రెండు చేతులు విరిగిపోవడం, తలపై లోతైన గాయం, ఆమె బుగ్గలపై గాట్లు, కాలిన గాయాల గుర్తులు ఉండటం చూసి అందరూ షాక్ అయ్యారు. అప్పట్లో ఈ అమ్మాయి కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బాలికను ఆసుపత్రికి తీసుకువచ్చిన మహిళ కూడా హ్యూమన్ ట్రాఫికింగ్ బాధితురాలే అని పోలీసులు తెలుసుకుంటారు . చివరికీ బాలిక దుస్థితికి కూడా ఆమె కారణమని తెలుస్త్ఉంది.  ఆ బాలిక ఏడ్చినప్పుడు, కోపంతో ఆమెను కొట్టి, కొరికి, ఆమె బుగ్గలను తగలబెట్టింది. ఈ విషయం దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని తెప్పించింది.

 

ఇవి కూడా చదవండి

ఆ రెండేళ్ల బాలిక దాదాపు రెండు నెలల పాటు ఆసుపత్రిలో జీవన్మరణ పోరాటం చేసింది. చివరకు ప్రాణాలు వొదిలేసింది.  వైద్యులు ఆమెను రక్షించలేకపోయారు. తరువాత పోలీసులు 15 ఏళ్ల బాలికను, ఆమె ప్రియుడిని ఇతరులను అరెస్టు చేశారు. ఈ సంఘటన మొత్తం దేశాన్ని కుదిపేసింది. ఈ సంఘటన ఒక పెద్ద మానవ అక్రమ రవాణా ముఠాను బయట పెట్టింది. వీరిద్దరే కాదు దేశవ్యాప్తంగా చాలా మంది  అమ్మాయిలు హ్యూమన్  ట్రాఫికింగ్ లో చిక్కకున్నారని పోలీసులు తెలుసుకుంటారు.

 

2012లో దేశాన్ని కుదిపేసిన బేబీ ఫలక్ కేసు ఆధారంగా తెరకెక్కిన ఈ సిరీస్ పేరు డిల్లీ క్రైమ్ సీజన్ 3.  ఫాలీ షా, హ్యూమా ఖురేషి, రాజేష్ తైలాంగ్, రసిక దుగల్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సిరీస్ లో మొత్తం ఆరు ఎపిసోడ్స్ ఉన్నాయి. ఎక్కడ కూడా బోర్ కొట్టదు. ప్రస్తుతం ఈ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అందుబాటులో ఉంది.

 

 

 

నెట్ ఫ్లిక్స్ లో ఢిల్లీ క్రైమ్ సీజన్ 3..

తెలుగులోనూ స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి1677139,1677125,1677073,1676372