Oke Oka Jeevitham: ఓటీటీలోకి శర్వానంద్ సినిమా.. ఒకే ఒక జీవితం డిజిటల్‌ స్ట్రీమింగ్‌ అప్పుడే!

Oke Oka Jeevitham OTT Release: వరుసగా ఆరు ఫ్లాపుల తర్వాత ఒకే ఒక జీవితం సినిమాతో సాలిడ్‌ హిట్‌ అందుకున్నాడు యంగ్‌ అండ్‌ ట్యాలెంటెడ్‌ హీరో శర్వానంద్‌ (Sharwanandh). కొత్త దర్శకుడు శ్రీకార్తిక్ తెరకెక్కించినఈ మూవీలో రీతూవర్మ కథానాయికగా నటించగా

Oke Oka Jeevitham: ఓటీటీలోకి శర్వానంద్ సినిమా.. ఒకే ఒక జీవితం డిజిటల్‌ స్ట్రీమింగ్‌ అప్పుడే!
Oke Oka Jeevitham

Updated on: Sep 25, 2022 | 10:21 AM

Oke Oka Jeevitham OTT Release: వరుసగా ఆరు ఫ్లాపుల తర్వాత ఒకే ఒక జీవితం సినిమాతో సాలిడ్‌ హిట్‌ అందుకున్నాడు యంగ్‌ అండ్‌ ట్యాలెంటెడ్‌ హీరో శర్వానంద్‌ (Sharwanandh). కొత్త దర్శకుడు శ్రీకార్తిక్ తెరకెక్కించినఈ మూవీలో రీతూవర్మ కథానాయికగా నటించగా.. అక్కినేని అమల (Akkineni Amala) కీలకపాత్రలో కనిపించింది. ఎలాంటి అంచనాలు లేకుండా సెప్టెంబర్ 16వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈసినిమా మంచి విజయాన్ని అందుకుంది. టైం ట్రావెల్‌ నేపథ్యానికి మదర్ సెంటిమెంట్‌ జోడించి శ్రీ కార్తిక్‌ ఈ సినిమాను తెరకెక్కించిన విధానం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. ముఖ్యంగా శర్వానంద్- అమలల నటనకు అందరూ ఫిదా అవుతున్నారు. ఈనేపథ్యంలో థియేటర్లలో మంచి విజయం సాధించిన ఈ చిత్రం త్వరలోనే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో ప్రసారం కానుంది.

కాగా ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ సోనీ లీవ్ కైవసం చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇందుకోసం సుమారు 15 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది. వచ్చేనెల అంటే అక్టోబర్ రెండో వారంలో ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలున్నాయి. త్వరలోనే ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ గురించి అధికారిక ప్రకటన వెలువడనుందని సమాచారం. ప్రముఖ నిర్మాణ సంస్థ డ్రీమ్‌ వారియర్ పిక్చర్స్ తెరకెక్కించిన ఈ సినిమా తమిళంలో కణం పేరుతో విడుదలైంది. సైన్స్‌ ఫిక్షన్‌ ఎమోషనల్‌ డ్రామాగా ఆకట్టుకుంటోన్న ఈ సినిమాలో వెన్నెల కిశోర్‌, ప్రియదర్శి, నాజర్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. జేక్స్ బిజోయ్ స్వరాలు సమకూర్చగా అమ్మ పాట బాగా హిట్టైంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..