FARZI Trailer: ఫ్యామిలీ మ్యాన్‌ మేకర్స్‌ నుంచి మరో ఇంట్రెస్టింగ్‌ వెబ్‌ సిరీస్‌.. అంచనాలను అమాంతం పెంచేసిన ‘ఫర్జీ’ ట్రైలర్‌.

|

Jan 15, 2023 | 8:22 AM

ఫ్యామిలీ మ్యాన్ వెబ్‌ సిరీస్‌ ఎలాంటి వండర్స్‌ క్రియేట్‌ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దేశ వ్యాప్తంగా విడుదలైన అన్ని భాషల్లో ఈ సిరీస్‌ మంచి విజయాన్ని అందుకుంది. రెండు పార్టులుగా వచ్చిన వెబ్‌ సిరీస్‌ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఆర్‌, డీకేలు అద్భుత దర్శకత్వం..

FARZI Trailer: ఫ్యామిలీ మ్యాన్‌ మేకర్స్‌ నుంచి మరో ఇంట్రెస్టింగ్‌ వెబ్‌ సిరీస్‌.. అంచనాలను అమాంతం పెంచేసిన ఫర్జీ ట్రైలర్‌.
Farzi Trailer
Follow us on

ఫ్యామిలీ మ్యాన్ వెబ్‌ సిరీస్‌ ఎలాంటి వండర్స్‌ క్రియేట్‌ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దేశ వ్యాప్తంగా విడుదలైన అన్ని భాషల్లో ఈ సిరీస్‌ మంచి విజయాన్ని అందుకుంది. రెండు పార్టులుగా వచ్చిన వెబ్‌ సిరీస్‌ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఆర్‌-డీకేలు అద్భుత దర్శకత్వం ఈ సిరీస్‌ను ప్రాంతాలకు అతీతంగా మెప్పించేలా చేసింది. ఇదిలా ఉంటే తాజాగా వీరు తెరకెక్కించిన మరో వెబ్‌ సిరీస్‌ ఫర్జీ. ఈ వెబ్‌ సిరీస్‌తో బాలీవుడ్‌ స్టార్‌ హీరో షాహిద్‌ కపూర్‌ తొలిసారి డిజిటల్‌ ఎంట్రీ ఇవ్వనున్నారు. ఇక తమిళ స్టార్‌ విజయ్‌ సేతుపతి కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటించింది. ఈ సిరీస్‌ను ఫిబ్రవరి 10వ తేదీన అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల చేయనున్నారు.

ఈ నేపథ్యంలోనే తాజాగా చిత్ర యూనిట్‌ ఫర్జీ తెలుగు ట్రైలర్‌ను విడుదల చేసింది. 2.42 నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్‌ ఆద్యంతం ఆకస్తికరంగా సాగింది. డబ్బు చుట్టూ తిరిగే కథలా ఉంది. షాహిద్‌ కపూర్ ఇందుల దొంగ నోట్లు ముద్రించే వ్యక్తిగా కనిపించనున్నారు. ఇక విజయ్‌ సేతుపతి పోలీస్‌ అధకారి పాత్రలో నటిస్తున్నారు. ట్రైలర్‌ వెబ్‌ సిరీస్‌పై అమాంతం అంచనాలు పెంచేసింది. ట్రైలర్‌లో వచ్చిన డైలాగ్‌లు సైతం ఆకట్టుకుంటున్నాయి. ‘డబ్బుతో సంతోషాన్ని కొనలేం.. అలా చెప్పినోళ్లంతా చేతిలో నయా పైసా లేనివాళ్లే’, ‘అందరిలో ఓ దొంగ ఉంటాడు. అవకాశం ఎదురు చూస్తుంటాడు’ అని చెప్పే డైలాగ్‌లు ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. ఇక ఈ వెబ్‌ సిరీస్‌ రెజీనా కూడా నటించింది.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే ట్రైలర్‌ రిలీజ్‌ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌ మీట్‌లో దర్శకుడు రాజ్‌-డీకే మాట్లాడుతూ.. ‘మాకు ఇష్టమైన స్క్రిప్ట్‌ల్లో ఇదీ ఒకటి. ఎంతో అభిరుచితో ఈ వెబ్‌ సిరీస్‌ను రూపొందించాము. ‘ది ఫ్యామిలీమ్యాన్‌’ సిరీస్‌లానే ఇది కూడా అందరికి నచ్చుతుంది’ అని ధీమా వ్యక్తం చేశారు. ఈ వెబ్‌ సిరీస్‌పై రాశీఖన్నా కూడా భారీగానే అంచనాలు పెట్టుకుంది. మరి ఈ వెబ్‌ సిరీస్‌ ఎలాంటి సంచనలు సృష్టిస్తుందో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..