
ఎప్పటిలాగే ఈ వారం కూడా ఓటీటీలో కొత్త సినిమాలు, ఆసక్తికర వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. అయితే బుధవారమే ఓ ఇంట్రెస్ట్రింగ్ అండ్ పాపులర్ వెబ్ సిరీస్ సీక్వెల్ ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఇంగ్లిష్ తో పాటు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. వరల్డ్ వైడ్ గా ఆడియన్స్ మనసులు గెలుచుకున్న అత్యంత పాపులర్ సిరీస్ లో ఇది కూడా ఒకటి. తెలుగు ఆడియెన్స్ లోనూ చాలా మంది ఈ సిరీస్ కు ఫ్యాన్స్ ఉన్నారు. సీజన్ 1 వచ్చిన 20 నెలల తర్వాత సీజన్ 2 ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సిరీస్ ఫస్ట్ సీజన్ లో అన్ని ఎపిసోడ్లు ఒకేసారి రిలీజ్ చేశారు. కానీ సెకండ్ సీజన్లో వారానికో ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. డిసెంబర్ 17 నుంచి ఫిబ్రవరి 4 వరకు వారానికో ఎపిసోడ్ ఆడియన్స్ ను థ్రిల్ కు గురి చేయనుంది. ఇంతకీ ఆ వెబ్ సిరీస్ ఏదనుకుంటున్నారా? ఫాల్అవుట్ సీజన్ 2. ఇందులో మొత్తం 8 ఎపిసోడ్లున్నాయి. ఇవాళ్టి నుంచే ఫస్ట్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతోంది.
టిమ్ కెయిన్, లియోనార్డ్ బోయార్స్కీల ప్రసిద్ధ వీడియో గేమ్ ఆధారంగా ఈ సైన్స్ ఫిక్షనల్ థ్రిల్లర్ సిరీస్ ను రూపొందించారు. ఫాల్‌అవుట్ సీజన్ 1 ముగింపులో బ్రదర్‌హుడ్ ఆఫ్ స్టీల్, మోల్డేవర్ న్యూ కాలిఫోర్నియా రిపబ్లిక్ రేడర్‌ల మధ్య యుద్ధం జరిగింది. ఇందులో నుంచి మ్యాగ్జిమస్ పవర్ ఆర్మర్ తో హాంక్ తప్పించుకుంటాడు. ఇక సీజన్ 2లో లూసీ తండ్రి హాంక్ మెక్లీన్ న్యూ వేగాస్ అనే ప్రాంతానికి వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరుగుతంది? అన్నది తెలుసుకోవాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే
ఫాల్అవుట్ సీజన్ 2 లో ఎల్లా పుర్నెల్, వాల్టన్ గాగిన్స్, ఆరోన్ మోటెన్ కీ తదితరులు నటించారు. ప్రస్తుతం ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇంగ్లిష్ తో పాటు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది.
I’ve been looking forward to this since the minute I finished season 1… The wait is over.
Now watching Fallout Season 2 episode 1 😍#Fallout #FalloutSeason2 #Lucy #EllaPurnell #Ghoul #WaltonGoggins #drama #action #scifi #PrimeVideo @falloutonprime #Christmas #Geek pic.twitter.com/ZSryj6gOVn— Russell Garland (@Roo8019) December 17, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..