AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amaran OTT: అమరన్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్! అరోజు నుంచే శివ కార్తికేయన్, సాయి పల్లవిల సినిమా స్ట్రీమింగ్

‘అమరన్‌’ సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. చెన్నైతో పాటు తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. అయితే థియేటర్లలో ఉండగానే అమరన్ సినిమా ఓటీటీ రిలీజ్ పై ఒక ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తోంది.

Amaran OTT: అమరన్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్! అరోజు నుంచే శివ కార్తికేయన్, సాయి పల్లవిల సినిమా స్ట్రీమింగ్
Amaran
Basha Shek
|

Updated on: Nov 24, 2024 | 7:15 PM

Share

శివకార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన అమరన్ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తోంది. మేజర్ ముకుంద్ వరదరాజన్ నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. దీపావళి కానుకగా అక్టోబర్ 31న అమరన్ సినిమా విడుదలైంది ఈ సినిమా చూసిన ప్రేక్షకుల తో పాటు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు.అమరన్ సినిమాలో మేజర్ ముకుంద్ వరదరాజన్ పాత్రలో శివ కార్తికేయన్ అద్భుతంగా నటించాడు. ఈ పాత్ర కోసం తన లుక్ ను పూర్తిగా మార్చుకున్నాడీ స్టార్ హీరో. ఇక వరదరాజన్ భార్య రెబెక్కా పాత్రలో సాయి పల్లవి అభినయం నెక్ట్స్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. రాజ్‌కుమార్ పెరియస్వామి తెరకెక్కించిన ‘అమరన్‌’ సినిమాను కమల్ హాసన్ నిర్మించడం విశేషం. రాహుల్ బోస్, భువన్ అరోరా, శ్యామ్ ప్రసాద్ వంటి ఆర్టిస్టులు ఈ సినిమాలో నటించారు. కాగా ఇప్పటికే అమరన్ సినిమా రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. చెన్నైతో పాటు తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల అమరన్ సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సినిమాపై అన్ని వర్గాల ప్రేక్షకులు సానుకూలంగా స్పందించడం చిత్ర బృందానికి ప్లస్ అయింది. శివకార్తికేయన్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రం అమరన్. ఈ సినిమాలో ఎమోషన్‌, యాక్షన్‌ హైలైట్‌గా నిలిచాయి. కశ్మీర్‌లో విధులు నిర్వహిస్తున్న సైనికుల చుట్టూ ఈ సినిమా కథ నడుస్తుంది.

ఇప్పటికీ థియేటర్లలో మంచి రెస్పాన్స్ అందుకున్న అమరన్ సినిమా మరికొన్ని రోజుల్లోనే ఓటీటీలోకి రానుందని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా OTT హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. డిసెంబర్ 5 లేదా 10 నుంచి OTTలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అదే సమయంలో థియేటర్లలో మంచి వసూళ్లు రాబడుతుండటంతో OTT విడుదల మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని కూడా టాక్ నడుస్తోంది. థియేటర్ యాజమాన్యాల నుంచి కూడా ఓటీటీ విడుదల వాయిదా వేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది. త్వరలోనే దీనిపై ఒక క్లారిటీ రానుంది.

ఇవి కూడా చదవండి

అమరన్ సినిమాలో శివ కార్తికేయన్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.