OTT Movies: ఓటీటీలో దూసుకుపోతోన్న ‘హెర్’ చాప్టర్ 1.. ఆరు వారాలవుతున్నా ట్రెండింగ్‌లో..

|

Nov 18, 2023 | 10:07 AM

థియేటర్స్ లో రిలీజ్ అయిన సినిమాలు కూడా ఓటీటీలోను సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్నాయి. సినిమాలు థియేటర్ లో రిలీజ్ అయిన నెల రోజులకు ఓటీటీలో సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. కొన్ని సినిమాలు డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే చాలా సినిమాలు ఓటీటీలో రికార్డ్ క్రియేట్ చేశాయి కూడా..

OTT Movies: ఓటీటీలో దూసుకుపోతోన్న హెర్ చాప్టర్ 1.. ఆరు వారాలవుతున్నా ట్రెండింగ్‌లో..
Her
Follow us on

థియేటర్స్ లో సినిమాలు దూసుకుపోతున్నపటికీ ఓటీటీలోనూ సినిమాలు ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే చాలా సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయ్యి మంచి క్రేజ్ ను సొంత చేసుకున్నాయి. థియేటర్స్ లో రిలీజ్ అయిన సినిమాలు కూడా ఓటీటీలోను సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్నాయి. సినిమాలు థియేటర్ లో రిలీజ్ అయిన నెల రోజులకు ఓటీటీలో సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. కొన్ని సినిమాలు డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే చాలా సినిమాలు ఓటీటీలో రికార్డ్ క్రియేట్ చేశాయి కూడా. తాజాగా ఓ మూవీ ఆరువారాలుగా ట్రెండింగ్ లో ఉంది రికార్డ్ క్రియేట్ చేసింది. ఆ సినిమానే హెర్ చాప్టర్ 1. ఈ సినిమా క్రైం ఇన్ థ్రిల్లర్ గా తెరకెక్కింది.

రుహానీ శర్మ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ మూవీ ఓటీటీలో ఇంకా ట్రెండ్ అవుతూనే ఉంది. శ్రీధర్ స్వరాఘవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను దీప సంకురాత్రి, రఘు సంకురాత్రి నిర్మించారు. ఏసీపీ అర్చనా ప్రసాద్‌గా రుహానీ శర్మ ఈ సినిమాలో నటించి మెప్పించింది.

ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాలో రుహానీ శర్మ నటనకు మంచి స్పందన వస్తుంది. ఆమె తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాకు విశేష స్పందన వస్తుంది. అమెజాన్ ప్రైమ్ ఏ సినిమాను స్ట్రీమింగ్ చేస్తుంది. ఆరువారాల అవుతున్నపటికి హెర్ చాప్టర్ 1 సినిమా అమెజాన్ ప్రైమ్ లో టాప్ 10 సినిమాల్లో ఒకటిగా నిలిచింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.