Valari OTT: ఓటీటీలోకి వచ్చేసిన దడ పుట్టించే దెయ్యం సినిమా.. రితికా సింగ్ ‘వళరి’ ఎక్కడ చూడొచ్చంటే?

|

Mar 06, 2024 | 8:59 AM

మసూద, విరూపాక్షి, పొలిమేర 1, 2, మంగళవారం, పిండం.. ఇలా భయపెట్టిన హార్రర్ సినిమాలకు ఓటీటీలో రికార్డ్ వ్యూస్ వచ్చాయి. ఇప్పుడిదే కోవలో ఓటీటీ ఆడియెన్స్ ను భయటపెట్టేందుకు మరొక సినిమా వచ్చింది. అదే గురు సినిమా హీరోయిన్ రితికా సింగ్ నటించిన వళరి.

Valari OTT: ఓటీటీలోకి వచ్చేసిన దడ పుట్టించే దెయ్యం సినిమా.. రితికా సింగ్ వళరి ఎక్కడ చూడొచ్చంటే?
Valari Movie
Follow us on

ఓటీటీలో క్రైమ్, సస్పెన్స్, హారర్ థ్రిల్లర్ సినిమాలకు మంచి ఆదరణ ఉంది. ముఖ్యంగా భయపెట్టే హార్రర్ సినిమాలకు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ పై మంచి రెస్పాన్స్ వస్తోంది. మసూద, విరూపాక్షి, పొలిమేర 1, 2, మంగళవారం, పిండం.. ఇలా భయపెట్టిన హార్రర్ సినిమాలకు ఓటీటీలో రికార్డ్ వ్యూస్ వచ్చాయి. ఇప్పుడిదే కోవలో ఓటీటీ ఆడియెన్స్ ను భయటపెట్టేందుకు మరొక సినిమా వచ్చింది. అదే గురు సినిమా హీరోయిన్ రితికా సింగ్ నటించిన వళరి. మ్రితికా సంతోషి ఈ సినిమాతో డైరెక్టర్ గా టాలీవుడ్ కు పరిచయం కానున్నారు. ఒకరికి ఒకరు ఫేమ్ శ్రీరామ్ ఇందులో హీరోగా నటించాడు. టీజర్స్, ట్రైలర్ తోనే భయపెట్టిన వళరి సినిమా నేరుగా డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. బుధవారం (మార్చి6) అర్ధ రాత్రి నుంచే ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ లో ఈ హార్రర్ సినిమా స్ట్రీమింగ్ కు అందుబాటులో వచ్చేసింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది ఈటీవీ విన్.

వళరి సినిమాలో సుబ్బరాజు, ఉత్తేజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.  కె.సత్య సాయిబాబు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఇక సినిమా కథ విషయానికి వస్తే.. వెంకటాపురం బంగ్లాలో దెయ్యాలు ఉన్నాయని ఊళ్లో వాళ్లంతా చెప్పుకుంటుంటారు. అదే సమయంలో భార్య రితికా సింగ్ తో కలసి ఆ ఇంట్లోకి కుటుంబంతో సహా దిగుతాడు హీరో శ్రీరామ్. అప్పటి నుంచి ఓ  పపదమూడేళ్ల అమ్మాయి తల్లిదండ్రులను చంపినట్టు దివ్యకు తరచూ కల వస్తుంది.అదే సమయంలో దివ్యకు యాక్సిడెంట్ అవుతుంది? వీటితో పాటు బంగ్లాలోకి వచ్చిన తర్వాత ఎన్నో ఊహించని పరిస్థితులు ఎదురవుతాయి. మరి బంగ్లాకు, దివ్యకు ఏంటి సంబంధం? అసలు ఆ బంగ్లా ఎవరిది? అన్నది తెలుసుకోవాలంటే వళరి సినిమా చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

 

 

ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్..

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.