OTT Movie: చిన్న తప్పుకు 23 మంది బలి.. ఓటీటీలో కన్నీళ్లు తెప్పిస్తోన్న రియల్ క్రైమ్ స్టోరీ.. ఐఎమ్‌డీబీలోనూ టాప్ రేటింగ్

ఈ మధ్యన నిజ జీవితంలో జరిగిన సంఘటనలు, ప్రముఖ వ్యక్తుల జీవిత కథల ఆధారంగా సినిమాలు, సిరీస్ లు తెరకెక్కుతున్నాయి. వీటికి ఆడియెన్స్ నుంచి మంచి స్పందన వస్తోంది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది.

OTT Movie: చిన్న తప్పుకు 23 మంది బలి.. ఓటీటీలో కన్నీళ్లు తెప్పిస్తోన్న రియల్ క్రైమ్ స్టోరీ.. ఐఎమ్‌డీబీలోనూ టాప్ రేటింగ్
OTT Movie

Updated on: Nov 13, 2025 | 8:32 PM

ఈ మధ్యన ఓటీటీలో రియల్ స్టోరీలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమాలు, సిరీస్ లను చూసేందుకు ఆడియెన్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ సినిమా కూడా ఒక రియల్ స్టోరీనే. అందులోనూ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. కొన్ని నెలల క్రితం థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. కలెక్షన్లు రాకపోయినా పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. అలాగే విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి. 1993 నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది. ఒకే గ్రామానికి చెందిన సాగర్‌, సుశీల ఇద్దరూ ప్రేమించుకుంటారు. సాగర్‌కు దాస్ అనే మరో ఫ్రెండ్ కూడా ఉంటాడు. నిమ్న కులాలకు చెందిన వారు కావడంతో వీరు ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటారు. ఏం చేయాలో తెలియక చిన్న చిన్న దొంగ తనాలు చేస్తుంటారు. అలా ఓసారి బస్సు దోపిడీ చేయాలనుకుంటారు. ప్రయాణికులను భయపెట్టెందుకు పెట్రోల్ క్యాన్ ను తీసుకెళతారు. అయితే ప్యాసింజర్స్ పెద్దగా కేకలు వేయడంతో కంగారులో బస్సుకు నిప్పంటిస్తారు. అంతే బస్సులో ఉన్న 23 మంది అక్కడికక్కడే సజీవ దహనమైపోతారు. అందులో ముక్కుపచ్చలారని పసిపిల్లలు కూడా ఉంటారు. దీంతో న్యాయ స్థానం వారికి ఉరి శిక్ష వేస్తుంది.

అయితే సాగర్ ను ఉరిశిక్ష నుంచి తప్పించేందుకు సుశీల చాలా ప్రయత్నాలు చేస్తుంది. కానీ వారు దళితులు కావడంతో పేరున్న న్యాయవాదులు ఈ కేసు గురించి పట్టించుకోరు. మరి సాగర్, దాస్ కు ఉరిశిక్ష నిలిచిపోయిందా? చివరకు ఏమైంది? అన్నది తెలుసుకోవలంటే ఈ రియల్ స్టోరీ చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

ఈ సినిమా పేరు 23 (ఇరవై మూడు). 1993లో ఏపీలో సంచలనం సృష్టించిన చిలకలూరి పేట బస్సు దహనం నేపథ్యం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. మల్లేశం, 8 AM మెట్రో సినిమాలతో ట్యాలెంటెడ్ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాజ్ రాచకొండ ఈ సినిమాను తెరకెక్కించాడు. తేజ, తన్మయా, వేద వ్యాస్, ఝాన్సీ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ సినిమా ఆహా, ఈటీవీవిన్, అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.