ధమాకా, వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత మాస్ మహరాజా రవితేజ నటించిన చిత్రం రావణాసుర. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌లో అను ఇమాన్యుయేల్, దక్ష నాగర్కర్, పూజిత పొన్నాడ, ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాష్ కథానాయికలుగా అలరించారు. అక్కినేని సుశాంత్ కీలక పాత్రలో మెరిశాడు. భారీ అంచనాలతో ఏప్రిల్ 7న థియేటర్లలో విడుదలైన రావణాసుర మిక్స్ డ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే టైటిల్‌కు తగ్గట్టే నెగెటివ్ రోల్‌లో మరోసారి అదరగొట్టేశాడు రవితేజ. సినిమాలోని ట్విస్టులు, యాక్షన్ సీక్వెన్స్ మాస్ మహరాజా ఫ్యాన్స్‌ని బాగా ఆకట్టుకున్నాయి. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన ఈ చిత్రం ఇప్పుడు సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. రావణాసుర మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. మే మొదటి వారం లేదా రెండో వారంలో ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయవచ్చని మొదట ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు ఎలాంటి ముందస్తు సమాచారం లేదా ప్రకటన లేకుండానే అర్ధరాత్రి నుంచి రవితేజ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.
అభిషేక్ పిక్చర్స్, ఆర్టీ టీమ్ వర్క్స్ బ్యానర్లపై అభిషేక్ నామా, రవితేజ సంయుక్తంగా రావణాసుర చిత్రాన్ని నిర్మించారు. శ్రీకాంత్ విస్సా కథను అందించగా హర్షవర్దన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో స్వరాలు సమకూర్చారు. శ్రీరామ్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మరి థియేటర్లలో రవితేజ యాక్షన్ పెర్ఫామెన్స్‌ను మిస్ అయిన వారు ఎంచెక్కా అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూసి ఎంజాయ్ చేయండి.
• #RaviTeja‘s #Ravanasura is now Streaming On Prime in Telugu and Tamil.?
Let’s see how OTT Audiences Receiving This Movie ??#TigerNageswaraRao#KRACK2 pic.twitter.com/rsJ5tVlRoo
— OTT STREAM UPDATES (@newottupdates) April 28, 2023
Ravanasura movie streaming on AmazonPrimeVideo. pic.twitter.com/iJeUX2IE3w
— OTT Telugu Streaming Updates (@OTTTeluguMSR) April 28, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.