AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dhurandhar 2 OTT: వెయిట్ ఈజ్ ఓవర్.. ఓటీటీలోకి ధురంధర్ 2! 1800 కోట్ల సినిమా స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది

ఇండియన్ సినిమా ఇండస్ట్రీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచింది రణ్ వీర్ సింగ్ నటించిన ధురంధర్ ది రివేంజ్ (ధురంధర్ 2). థియేటర్లలో 1800 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Dhurandhar 2 OTT: వెయిట్ ఈజ్ ఓవర్.. ఓటీటీలోకి ధురంధర్ 2! 1800 కోట్ల సినిమా స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది
Dhurandhar 2 OTT
Basha Shek
|

Updated on: Apr 28, 2026 | 12:07 PM

Share

రణ్‌వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్‌ మూవీ దురంధర్ ది రివేంజ్ (ధురంధర్ 2). మార్చి 19న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ కలెక్షన్లలోసరికొత్త రికార్డ్స్‌ సృష్టించింది. ఇటీవలే 1800 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన ఈ సినిమా తెలుగు మూవీ పుష్ప-2 కలెక్షన్స్‌ను సైతం దాటేసింది. తద్వారా ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో మూడోస్థానంలో నిలిచింది. కాగా థియేటర్లలో కాసుల వర్షం కురిపించిన ధురంధర్ 2 సినిమాను ఓటీటీలో చూడాలని చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ థియేటర్లలో విడుదలై సుమారు నెలన్నర రోజులు గడిచింది. దీంతో ఎప్పుడెప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి వస్తుందా? అని ఆడియెన్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్ స్టార్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ బాక్సాఫీస్ సెన్సేషన్ ఓటీటీ స్ట్రీమింగ్ పై సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ టాక్ నడుస్తోంది. మే 14 వ తేదీ నుంచి ధురంధర్ 2 సినిమా ఓటీటీలోకి రానుందన్న వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. త్వరలోనే దీనిపై ఓ అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు సమాచారం.

ఆధిత్య ధర్ తెరకెక్కించిన ధురంధర్ ది రివేంజ్ సినిమాలో రణ్‌వీర్ సింగ్ సరసన సారా అర్జున్‌ హీరోయిన్‌గా నటించింది. అలాగే అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్. మాధవన్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి ఆదిత్య ధర్ దర్శకత్వం వహించడంతో పాటు సహ నిర్మాతగా కూడా వ్యవహరించడం విశేషం. కాగా ఈ బ్లాక్ బస్టర్ సినిమా జియో హాట్ స్టార్ తో పాటు నెట్‌ఫ్లిక్స్‌లో కూడా స్ట్రీమింగ్ కానుందని చెబుతున్నారు. ఇంటర్నేషనల్ ఆడియెన్స్ ను అలరించడమే లక్ష్యంగా నెట్ ఫ్లిక్స్ తో కూడా చిత్ర బృందం డీల్ కుదుర్చుకుందని సమాచారం.

ఇవి కూడా చదవండి

మే 14 నుంచి జియో హాట్ స్టార్ లో ధురంధర్ ది రివేంజ్..

1900 కోట్లను దాటిన ధురంధర్ 2 కలెక్షన్లు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!