కంటెంట్ నచ్చితే చాలు.. చిన్న సినిమాకైనా పట్టం కట్టేస్తున్నారు ప్రేక్షకులు. స్టోరీ కాస్త వేరుగా.. ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే… చిన్న సినిమా అయినా సూపర్ హిట్ చేసేస్తున్నారు. ఇక ఓటీటీల పుణ్యమా అని చిన్ని సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. థియేటర్లలో మంచి టాక్ సంపాదించుకున్న చిత్రాలను ఓటీటీలో ఆదరిస్తున్నారు. అంతేకాదు.. బారీ బడ్జెట్ సినిమాలను సైతం వెనక్కు నెట్టి ట్రెండింగ్‌లో దూసుకుపోతున్నాయి. ఇక డిజిటల్ రంగంలో చిన్న సినిమాలు భారీ విజయాన్ని అందుకుంటున్నాయి. ఈ కోవలోకి చెందినదే రామ్ అసుర (Ramasur) సినిమా.
అభినవ్ సర్దార్, రామ్ కార్తీక్, చాందినీ, షానీ సల్మాన్ ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం రామ్ అసుర. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి టాక్ సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన భారీ బడ్జెట్ చిత్రాలతో పోటీగా దూసుకుపోతూ ట్రెండింగ్‌లో సెకండ్ ప్లేస్‌లో నిలిచింది. తెలుగు మూవీస్, క్యాటగిరీలోనూ.. రామ్ అసుర్ సినిమా రెండవ స్థానంలో నిలిచింది. ఆర్టిఫీషియల్ డైమండ్ ను రూపొందించాలనుకున్న ఇద్దరి సైంటిస్టుల జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇక ఈ క్రియేటివ్ కథాంశంతోపాటు.. అందమైన లవ్ స్టోరీ కూడా ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇందులో అభినవ్ సర్ధార్, చాందినీల ప్రేమ కథ సినిమాను ప్రేక్షకులకు చేరువ చేసింది. ఈ చిత్రానికి వెంకటేశ్ త్రిపర్ణ దర్శకత్వం వహించగా. అభినవ్ సర్దార్ నిర్మించారు.
Allu Shirish: మల్టీస్టారర్ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అల్లువారబ్బాయి.. మరో హీరో ఎవరంటే..
Janhvi Kapoor: టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన అతిలోక సుందరి తనయ.. ఏ సినిమాతో అంటే..