
బాలయ్య హోస్ట్ గా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న అన్ స్టాపబుల్ విత్ ఎన్సీకే షో లేటెస్ట్ ఎపిసోడ్ కు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హాజరయ్యారు. తన గేమ్ ఛేంజర్ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈ టాక్ షోకు వచ్చిన చరణ్ తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ముఖ్యంగా చిరంజీవి, పవన్ కల్యాణ్, నాగబాబులతో తనకున్న అనుబంధంపై ఓపెన్ అయిపోయాడు. షోలో భాగంగా బాలకృష్ణ చిరంజీవి, నాగబాబు, పవన్ కలిసి ఉన్న ఫొటోని చూపించి వాళ్ల ముగ్గురి గురించి పలు ప్రశ్నలు అడిగారు. వీటికి రామ్ చరణ్ ఆసక్తికర సమాధానాలిచ్చాడు. ‘నాన్న సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉండడంతో నేను చిన్నప్పుడు పవన్ కల్యాణ్ బాబాయ్ తోనే అన్నీ షేర్ చేసుకునే వాడిని. నాన్న కూడా నా బాధ్యతలను కల్యాణ్ బాబాయికే అప్పచెప్పే వారు. ట్యూషన్స్ నుంచి హార్స్ రైడింగ్ వరకు అన్నీ బాబాయినే తీసుకెళ్లేవారు. ఇంటికి వచ్చాక మాత్రం ఫుడ్, స్టడీస్, హోమ్ వర్క్ ఇతర బాధ్యతలు నాగ్ బాబాయి చూసుకునే వారు. ఏదైమైనా నా చిన్నప్పుడు ఎక్కువ సమయం కళ్యాణ్ బాబాయ్ తోనే గడిపాను’
‘ఏ విషయంలోనైనా ఓపిక ఉండాలని సలహా ఇచ్చారు కళ్యాణ్ బాబాయ్. నిజంగా ఆయనకు చాలా ఓపిక. దేన్నైనా భరిస్తారు. భరించే తత్త్వం నేను ఆయన దగ్గర్నుంచి నేర్చుకున్నాను. నాన్న అయితే పెద్దలకు మర్యాద, గౌరవం ఇవ్వమని చెపుతారు. ఆ విషయంలో తేడా వస్తే అసలు ఊరుకోరు. నాగబాబు బాబాయ్ చాలా జోవియల్ గా ఉంటారు. ఆయన వేసే జోకులకు పడీ పడీ నవ్వుతాం. డాడీ, కళ్యాణ్ బాబాయ్ బాగా సైలెంట్. నాగబాబు బాబాయ్ మాత్రం సరదా మనిషి. కళ్యాణ్ బాబాయ్ లెగో బొమ్మలు, బుక్స్ లతోనే తన సమయాన్ని గడిపేవారు. ఆయన దగ్గర రెండు రూమ్స్ కలెక్షన్ బుక్స్ ఉన్నాయి’ అని రామ్ చరణ్ చెప్పుకొచ్చారు.
Anduke fitting pedtha 😜
Watch Now! #UnstoppableWithNBKS4 – Ram Charan Episode, on aha 👉https://t.co/BA3liveLqX@AlwaysRamCharan @ImSharwanand #Prabhas #PawanKalyan #NandamuriBalakrishna #Unstoppable #Ramcharan #DilRaju #Gamechanger #Daakumaharaaj pic.twitter.com/09NlBoudCc
— ahavideoin (@ahavideoIN) January 9, 2025
Babai pilupulo swing untadi 😍
Watch Now! #UnstoppableWithNBKS4 – Ram Charan Episode, on aha 👉https://t.co/Sb8o1DTMeB
@ImSharwanand #Prabhas #PawanKalyan @AlwaysRamCharan #NandamuriBalakrishna #Unstoppable #Ramcharan #DilRaju #Gamechanger #Daakumaharaaj pic.twitter.com/Jeu2WYI0AT— ahavideoin (@ahavideoIN) January 9, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.