సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ‘జైలర్’. నెల్సన్ దిలీప్‌కుమార్. తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో శివరాజ్‌కుమార్, మోహన్‌లాల్, జాకీ ష్రాఫ్, రమ్యకృష్ణ, తమన్నా, సునీల్ తదితరలు కీలక పాత్రలు పోషించారు. ఆగస్టు 10న థియేటర్లలో రిలీజైన జైలర్ ఇప్పటికీ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటివరకు రూ. 600 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి అత్యధిక కలెక్షన్లు రాబట్టిన రెండో తమిళ్ మూవీగా రికార్డులు నెలకొల్పింది. త్వరలోనే టాప్‌లో ఉన్న 2.ఓను కూడా ఈ సినిమా అధిగమించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇలా కాసుల వర్షం కురిపిస్తోన్న తరుణంలో జైలర్ సినిమా హెచ్‌డీ ప్రింట్ ఆన్‌లైన్‌లో లీకైంది. నిన్నటి నుంచి పలు పైరసీ సైట్లలో ఈ మూవీ దర్శనమిస్తోంది. దీంతో రజనీ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న తరుణంలో దయచేసి పైరసీని ఎంకరేజ్ చేయవద్దంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. మరోవైపు చిత్రబృందం కూడా జైలర్ పైరసీ లింక్‌లను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే జైలర్ సినిమాలోని పలు సన్నివేశాలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
కాగా జైలర్ థియేటర్లలో అడుగుపెట్టి మూడు వారాలు గడిచిపోయింది. అయితే ఇప్పటివరకు ఓటీటీ రిలీజ్‌పై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ముందుగా సెప్టెంబర్ 7న స్ట్రీమింగ్‌కు వచ్చే అవకాశముందని భావించారు. అయితే ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదు. అయితే ఓటీటీ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తే థియేటర్ కలెక్షన్లపై ప్రతికూల ప్రభావం పడుతుందంటున్నారు మేకర్స్. అయితే ఒప్పందం ప్రకారం నాలుగు వారాల తర్వాతే జైలర్ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. అన్నీ కుదరితే వినాయక చవితి సందర్భంగా రజనీకాంత్ సినిమాను స్ట్రీమింగ్‌కు తీసుకొచ్చే అవకాశముందట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుందని సమాచారం.
#Jailer OTT streaming online may be sooner than expected due to HD leaks.
OTT Streaming via #Netflix #SuperstarRajinikanth #MohanLal pic.twitter.com/OilZauGuB1
— Amal Krishna (@iamamalkrishna) August 30, 2023
వినాయక చవితి రోజునే స్ట్రీమింగ్ కు రానుందా?
#Jailer Coming Soon on @sunnxt in 4K Dolby Vision, HD10+ with Dolby Atmos 🤩
It will be in Premium Large Format (IMAX)#OTT_Trackers pic.twitter.com/qWGvWjbG5H
— OTT Trackers (@OTT_Trackers) August 30, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..