Chiranjeeva : ఓటీటీలోకి వచ్చేసిన రాజ్ తరుణ్ కొత్త సినిమా.. చిరంజీవ స్ట్రీమింగ్ ఎక్కడంటే..

తెలుగు సినీరంగంలో ఒకప్పుడు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో హిట్స్ అందుకున్నాడు హీరో రాజ్ తరుణ్. చాలా కాలంగా అతడు నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద నిరాశపరుస్తున్నాయి. కొన్నాళ్లుగా సైలెంట్ అయిన రాజ్ తరుణ్.. ఇప్పుడు చిరంజీవ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చాడు. ఈ సినిమాకు అభినయ కృష్ణ దర్శకత్వం వహించారు.

Chiranjeeva : ఓటీటీలోకి వచ్చేసిన రాజ్ తరుణ్ కొత్త సినిమా.. చిరంజీవ స్ట్రీమింగ్ ఎక్కడంటే..
Chiranjeeva Movie

Updated on: Nov 07, 2025 | 1:18 PM

ఉయ్యాల జంపాల సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచమయ్యాడు రాజ్ తరుణ్. తెలుగులో వరుస సినిమాలతో ఇండస్ట్రీలో లవర్ బాయ్ గా క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఒకప్పుడు బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకున్న రాజ్ తరుణ్.. ఇప్పుడు డౌన్ అవుతూ వచ్చారు. కెరీర్ తొలినాళ్లల్లో వరుస హిట్లతో స్టార్ స్టేటస్ సొంతం చేసుకున్న హీరో.. ఇప్పుడు సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్నారు. చాలా రోజుల తర్వాత రాజ్ తరుణ్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా చిరంజీవ. ఇందులో కుషిత కల్లపు కథానాయికగా నటించగా.. జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, కిరీటి, టేస్టి తేజ కీలకపాత్రలు పోషించారు. రాహుల్‌ అవురెడ్డి, సుమాసిని రాహుల్‌ నిర్మించిన ఈ సినిమాకు జబర్దస్త్ కమెడియన్ అదిరే అభి దర్శకత్వం వహించారు. ఇన్నాళ్లు కమెడియన్ గా అలరించిన అభి.. ఇప్పుడు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు.

ఈరోజు (నవంబర్ 7) నుంచి ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలోకి అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఆహాలో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. కథ విషయానికి వస్తే.. రాజ్ తరుణ్ కు చిన్నప్పటి నుంచి స్పీడెక్కువ. అతడి స్పీడ్ కు సూట్ అయ్యే పని అంబులెన్స్ డ్రైవింగ్. అయితే అతడు మాములు వ్యక్తి కాదని.. ప్రత్యేక శక్తులు ఉన్నాయని.. అందుకే అతడిని జాగ్రత్తగా చూసుకోవాలని అతడి తల్లిదండ్రులకు ఓ సాధువు చెబుతారు. అంబులెన్స్ డ్రైవర్ గా పనిచేస్తున్న రాజ్ తరుణ్ కుషిత కల్లపుతో ప్రేమలో పడతాడు. ఒకరోజు అనుకోకుండా రాజ్ తరుణ్ కు యాక్సిడెంట్ అవుతుంది.

ఇవి కూడా చదవండి : Meenakshi Chaudhari: ఆ హీరో సినిమాలో నటించి తప్పు చేశాను.. వారం రోజులు అలాంటి బాధ.. మీనాక్షి చౌదరి..

ఆ ప్రమాదం తర్వాత మనుషులపై మీటర్ కనిపిస్తుంది. వాళ్ల ఆయుష్షు సైతం తెలుసుకుంటాడు. ఆ తర్వాత రాజ్ తరుణ్ జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి.. ? తనకు కావాల్సిన మనుషులను ఎలా కాపాడుకున్నాడు అనేది సినిమా. ప్రస్తుతం ఈ మూవీ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.

ఇవి కూడా చదవండి :  Cinema : 64 ఏళ్ల హీరో సరసన 27 ఏళ్ల హీరోయిన్.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..