ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా (Aha) భామా కలాపం (Bhama Kalapam) పేరుతో మరో థ్రిల్లర్ కామెడీ వెబ్ సిరీస్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. ఇందులో హీరోయిన్ ప్రియమణి ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఈ సిరీస్‌తో ప్రియమణి తెలుగు ఓటీటీ మాధ్యమంలోకి అడుగుపెడుతుంది. అభిమన్యు తాడి మేటి దర్శకత్వం వహించిన.. ఈ సిరీస్ ఈనెల 11న ఆహాలో ప్రసారం కానుంది. ఇప్పటికే ఈ సిరీస్ నుంచి విడుదలైన ప్రోమోలు, పోస్టర్, ఫస్ట్ గ్లింప్స్, టీజర్ ట్రైలర్ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా.. ఈ థ్రిల్లర్ కామెడీ కోసం మ్యూజిక్ డైరెక్టర్ ప్రభాకరన్ అందించిన సంగీతం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.
100% తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహా ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్ అందిస్తుంది. ఇక ఇప్పుడు ఇంటి భోజనంలాంటి థ్రిల్లర్ కామెడీ వెబ్ ఒరిజినల్ ‘భామా కలాపం’ ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తుంది. ఈ సిరీస్‌తో మ్యూజిక్ డైరెక్టర్ జస్టిన్ ప్రభాకరన్ తొలిసారిగా ఓటీటీలోకి అరంగేట్రం చేస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ జస్టిన్ ప్రభాకరన్ గురించి ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తమిళం, తెలుగు చిత్ర పరిశ్రమలలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్పర్చుకున్నారు. ఇటీవలే హిందీలో మీనాక్షి సుందరేశ్వర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యారు. అలాగే రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు జస్టిన్ ప్రభాకర్. తెలుగు డిజిటల్ ప్లాట్ ఫాంలో రూపొందించబడిన క్రైమ్/ థ్రిల్లర్ కామెడీలలో భామాకలాపం ఒకటి. ఈ సిరీస్‌కు జస్టీన్ ప్రభాకరన్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు.
భామా కలాపం వెబ్ సిరీస్ గురించి జస్టిన్ ప్రభాకరన్ మాట్లాడుతూ.. ‘‘ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్‌లో థ్రిల్లర్‌గా సాగే ఈ సినిమా కథాంశాన్ని దృష్టిలో పెట్టుకుని మంచి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అందించాలనుకున్నాం. ఈ సిరీస్ మనలోని మంచి చెడులను మానసికంగా అన్వేషించే వెబ్ సిరీస్. అందుకే సరళమైన శైలిని ఎంచుకున్నాం. డార్క్ మ్యూజిక్, పల్లెటూరి సంగీతాన్ని ఈ భామా కలాపం కోసం ఎంచుకున్నాం.. అందుకు తగినట్టుగానే మాకు ఆశించినంత ఫలితం కనిపించిది. ఈ చిత్రానికి అలాంటి జానర్ , ఫ్యూజన్ ఎఫెక్ట్ అవసరమని అనుకున్నాం. ఇక ప్రేక్షకులు కూడా భామా కలాపంను ఆదరిస్తారని అనుకుంటున్నాను”.. అంటూ చెప్పుకొచ్చారు.
ఇందులో ప్రియమణి అనుపమ పాత్రను పోషిస్తుంది. ఒక యూట్యూబర్‌గా అనుపమ ఘుమఘుమ అనే ఛానెల్‌తో కనిపిస్తుంది. తొందరపాటు.. ఆసక్తి ఎక్కువగా ఉన్న ఓ అమాయక గృహిణిగా నటించింది ప్రియమణి. ఇందులో జాన్ విజయ్, శరణ్య ప్రదీప్, పమ్మి సాయి, శాంతి రావు కీలకపాత్రలలో నటించారు. ఈ సిరీస్‌ను ఎస్వీవీ బ్యానర్ పై సుధీర్ ఈదర, బోగవల్లి బాపినీడు నిర్మించారు.
Also Read: Samantha: పెద్దయ్యాక సమంత అవుతానంటున్న చిన్నారి.. వీడియో షేర్ చేసిన కీర్తి సురేష్..
Bigg Boss OTT: బిగ్‌బాస్ ఓటీటీ ప్రారంభం అప్పుడే .. ఫైనల్ కంటెస్టెంట్స్ ఎవరెవరంటే ?..
Rahul Ramakrishna: కమెడియన్ రాహుల్ రామకృష్ణ సంచలన నిర్ణయం.. ఇకపై సినిమాలు చేయనంటూ..