ఇప్పుడు థియేటర్లలో విడుదలైన సినిమాలు నెల రోజుల్లోపే ఓటీటీలోకి వస్తున్నాయి. హిట్, ప్లాఫ్ టాక్ తో సంబంధం లేకుండా దాదాపు సినిమాలన్నీ ఇలాగే డిజిటల్ ప్రీమియర్‌కు వచ్చేస్తున్నాయి. అయితే అక్కినేని అఖిల్ నటించిన ఏజెంట్ సినిమా మాత్రం ఇప్పటివరకు ఓటీటీలోకి రాలేదు. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఏప్రిల్ 28న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజైంది. అయితే మొదటి ఆటకే డిజాస్టర్ టాక్ రావడంతో సినిమా భారీ ప్లాఫ్‌గా నిలిచింది. ఆ వెంటనే మే 19న ఏజెంట్ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ సోనీలివ్ ప్రకటించింది. అయితే అదేమీ జరగలేదు. జులై వచ్చినా అఖిల్ సినిమా ఓటీటీలోకి రాలేదు. పైగా స్ట్రీమింగ్ డేట్‌పై ఎలాంటి అప్‌డేట్ కూడా రావడం లేదు. ఈ క్రమంలో ఏజెంట్ ఓటీటీ రిలీజ్ ఎందుకు ఆలస్యమవుతుందో అర్థం కాక అభిమానులు అయోమయంలో పడిపోయారు. మరోవైపు ఓటీటీ వ్యూయర్స్ కోసం అఖిల్ సినిమాను ఎడిట్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే నిర్మాత అనిల్ సుంకర మాత్రం ఈ వార్తలను ఖండించాడు.
ఓటీటీ ఆడియెన్స్ కోసం ఏజెంట్ సినిమాను ఎలాంటి ఎడిటింగ్ చేయడం లేదన్నారు అనిల్ సుంకర. ఇక సినిమాను రిలీజ్ చేయడం తమ చేతుల్లో లేదని సదరు ఓటీటీ ప్లాట్‌ఫామ్ చేతుల్లోనే ఉందన్నారు. ఆ సంస్థ ఎప్పుడు అనుకుంటే అప్పుడు స్ట్రీమింగ్ చేస్తుందన్నారు. మొత్తానికి ఏజెంట్ ఓటీటీ విడుదల విషయం సోనీలవ్ చేతుల్లోనే ఉందని తేల్చేశారు. సో.. ఏజెంట్ ఎడిటెడ్ వెర్షన్ కోసం ఎదురుచూసిన ఫ్యాన్స్ నిరాశకు ఇది నిరాశకలిగించే విషయమే. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఏజెంట్ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్‌గా నటించింది. మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..