Salaar Movie: సలార్ ఓటీటీ డేట్ వచ్చేసింది.. మరికొన్ని గంటల్లో స్ట్రీమింగ్.. ఎక్కడ చూడొచ్చంటే..

ఇన్నాళ్లు ఫ్యాన్స్ ఎదురుచూస్తోన్న మాస్ యాక్షన్ హీరో డార్లింగ్‏ను మరోసారి అభిమానుల ముందుకు తీసుకువచ్చాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఈ సినిమా పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.700 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రాన్ని రెండు పార్టులుగా తీసుకువస్తున్నారు మేకర్స్. ఫస్ట్ పార్ట్ విజయంతో.. ఇప్పుడు సెకండ్ పార్ట్ పై మరింత హైప్ పెరిగింది. ఇదిలా ఉంటే..

Salaar Movie: సలార్ ఓటీటీ డేట్ వచ్చేసింది.. మరికొన్ని గంటల్లో స్ట్రీమింగ్.. ఎక్కడ చూడొచ్చంటే..
Salaar Movie
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 19, 2024 | 9:38 AM

చాలా కాలం తర్వాత ప్రభాస్ ఖాతాలో మాస్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సినిమా సలార్. ఎన్నో అంచనాల మధ్య గతేడాది డిసెంబర్ 22న విడుదలైన ఈ మూవీ ఊహించని స్థాయిలో సెన్సెషన్ సృష్టించింది. బాహుబలి తర్వాత ఆ రేంజ్ హిట్ అందించిన మూవీ ఇదే కావడం విశేషం. ఇన్నాళ్లు ఫ్యాన్స్ ఎదురుచూస్తోన్న మాస్ యాక్షన్ హీరో డార్లింగ్‏ను మరోసారి అభిమానుల ముందుకు తీసుకువచ్చాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఈ సినిమా పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.700 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రాన్ని రెండు పార్టులుగా తీసుకువస్తున్నారు మేకర్స్. ఫస్ట్ పార్ట్ విజయంతో.. ఇప్పుడు సెకండ్ పార్ట్ పై మరింత హైప్ పెరిగింది. ఇదిలా ఉంటే.. ఇప్పటివరకు థియేటర్లలో సంచలనం సృష్టించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తోంది. విడుదలైన నెల రోజుల్లోనే డిజిటల్ ప్లాట్ ఫాంలోకి రాబోతుంది. మరికొన్ని గంటల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఇంతకీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో తెలుసా ?..

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుందని గతంలోనే అనౌన్స్ చేశారు మేకర్స్. కానీ రిలీజ్ డేట్ మాత్రం అనౌన్స్ చేయలేదు. ఇక ఇప్పుడు స్ట్రీమింగ్ డేట్ ప్రకటించి ప్రేక్షకులకు సర్ ప్రైజ్ చేసింది నెట్ ఫ్లిక్స్. ఈ సినిమా జనవరి 20 నుంచే స్ట్రీమింగ్ కాబోతుందని తెలిపారు. అంటే మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి రాబోతుంది. ఈ మూవీ రేపటి నుంచి స్ట్రీమింగ్ కాబోతుందని తెలియడంతో ఇప్పుడు అభిమానులు, ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఈరోజు అర్థరాత్రి నుంచి స్ట్రీమింగ్ కానుంది.

ఇక ఆ తర్వాత హిందీలో ఈ మూవీ రిలీజ్ అవుతుందని తెలుస్తోంది. ఇంకెందుకు ఆలస్యం..ఇప్పటివరకు థియేటర్లలో మిస్ అయిన వారు ఈ సినిమాను ఇప్పుడు నేరుగా ఓటీటీలో చూసేయ్యండి. ఇందులో శ్రుతిహాసన్, పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు, ఈశ్వరీ కీలకపాత్రలు పోషించగా.. రవి బస్రూర్ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ దాదాపు రూ. 400 కోట్ల బడ్జెట్ తో నిర్మించింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.