ప్రభాస్ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్. ఈ పాన్ ఇండియా సూపర్ స్టార్ నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ సలార్ అప్పుడే ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లలో రిలీజై నెల రోజులు పూర్తి కాకుండానే ఈ బ్లాక్ బస్టర్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్‌కు రావడం గమనార్హం. శుక్రవారం (జనవరి 20) అర్ధరాత్రి నుంచే ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో సలార్ సినిమా స్ట్రీమింగ్‌కు అందుబాటులో వచ్చింది. తెలుగుతో పాటు తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రభాస్ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన మాస్ ఎంటర్‌టైనర్‌లో శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటించింది. మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ మరో కీలక పాత్రలో మెరిశాడు. ఈశ్వరి రావు, బాబీ సింహా, జగపతి బాబు, టినూ ఆనంద్, శ్రియా రెడ్డి, సప్తగిరి తదితరులు ప్రధాన పాత్రలు పోషించాడు. డిసెంబర్ 22న విడుదలైన సలార్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. రూ.700 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి ప్రభాస్ స్టామినాను మరోసారి ప్రూవ్ చేసింది. అన్నిటికీ మించి బాహుబలి 2 తర్వాత ఆ రేంజ్ హిట్ లేని డార్లింగ్‌కు సలార్ రూపంలో మంచి సాలిడ్ హిట్ లభించింది. థియేటర్లలో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సలార్ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. ఇప్పుడీ నిరీక్షణకు తెరపడింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ పామ్ సలార్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను సొంతం చేసుకుంది. ఇందుకోసం సలార్ నిర్మాతలకు నెట్‌ఫ్లిక్స్ భారీగానే చెల్లించిందని సమాచారం. అయితే మొదట ప్రభాస్ సినిమాను జనవరి 26న స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రచారం జరిగింది. కానీ వారం రోజులు ముందుగానే అంటే శుక్రవారం(జనవరి 20) అర్ధరాత్రి నుంచే సలార్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. థియేట్రికల్ రిలీజై నెల రోజులు పూర్తి కాకుండానే ప్రభాస్ సినిమా ఓటీటీలోకి రావడం గమనార్హం.
‘ఒక స్నేహం వల్ల చరిత్ర మొదలైంది. అదే స్నేహం శత్రువుగా మారితే. ప్రభాస్ సలార్ నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చేసింది. తెలుగుతో పాటు తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉంది’ అంటూ ప్రభాస్ సినిమా ఓటీటీ రిలీజ్‌ను రివీల్ చేసింది నెట్‌ఫ్లిక్స్. హోంబలే సంస్థ సుమారు రూ. 400 కోట్ల బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా సలార్ సినిమాను నిర్మించింది. రవి బస్రూర్ స్వరాలు సమకూర్చారు. మరి సలార్ సినిమాను థియేటర్లలో మిస్ అయ్యారా? లేదా మళ్లీ చూడాలనుకుంటున్నారా? అయితే ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.
Oka sneham valla oka charithra modhalaindhi. Adhe sneham shatruthvanga maarithe? 🤔#Salaar is coming to Netflix on 20th Janurary in Telugu, Tamil, Malayalam and Kannada pic.twitter.com/9JDgib8JXg
— Netflix India South (@Netflix_INSouth) January 19, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.