1973లో విడుదలైన హారర్ సినిమా. అప్పట్లో ఈ చిత్రాన్ని థియేటర్లలో చూడాలంటే ఎంతో మంది భయపడేవారట. ముఖ్యంగా సినిమా రిలీజ్ సమయంలో గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు ఈ చిత్రాన్ని వెళ్లొద్దని హెచ్చరించారంటే ఈ సినిమా ఏ రేంజ్లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల కొన్నాళ్లుగా హారర్, థ్రిల్లర్, మిస్టరీ చిత్రాలను చూసేందుకు ప్రేక్షకులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే ఇప్పుడు మేకర్స్ సైతం ఇలాంటి జానర్ చిత్రాలు చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. గత 50 ఏళ్లలో విడుదలవుతున్న తొలి హారర్ చిత్రంగా ఈ సినిమా నిలుస్తుందని విమర్శకులు పేర్కొన్నారు. అంతేకాదు.. ఒక్కసారి ఈ సినిమా గానీ చూశారంటే నిద్రపోవడం కష్టమే. ఇంతకీ ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన సినిమా ఏది అని ఆలోచిస్తున్నారా. ? అయితే మీ సందేహాలకు ఆన్సర్ దొరికినట్లే. ఇప్పుడు మనం చెప్పబోయే సినిమా పేరు ది ఎక్సార్సిస్ట్.
ఇంగ్లండ్, ఐర్లాండ్, స్కాట్లాండ్‌లలో ఈ సినిమాను బ్యాన్ చేశారు. విలియం పీటర్ బ్లాటీ రాసిన నవల ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమా 1973లో విడుదల చేశారు. ఎక్సార్సిస్ట్ ఒక నిజమైన సంఘటన ఆధారంగా రూపొందించారు. ఈ హాలీవుడ్ చిత్రానికి స్క్రిప్ట్‌ను విలియం పీటర్ రాశారు. అమెరికాలో కేవలం 25 థియేటర్లలోనే ఈ సినిమా విడుదలైంది. ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ రావడంతో అమెరికాలోనే కాకుండా చాలా దేశాల్లో కూడా రిలీజ్ చేశారు. థియేటర్లలో ఈ సినిమా చూస్తూ భయంతో కేకలు వేస్తూ బయటకు వచ్చారు చాలా మంది.
ది ఎక్సార్సిస్ట్ అనేక అవార్డులను గెలుచుకుంది. సినీ పరిశ్రమలో అతిపెద్ద అవార్డు అయిన ఆస్కార్‌ను కూడా గెలుచుకుంది. ఇన్నాళ్లు థియేటర్లలో ప్రేక్షకులను భయపెట్టించిన ఈ సినిమాను ఇప్పటికీ చాలా మందికి ఒంటరిగా చూసే ధైర్యం లేదు.
Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఇన్ స్టాలో ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్.. ఎవరో తెలుసా..?
Tollywood : గ్యాంగ్‌స్టర్‌తో ప్రేమలో పడి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్.. ఇండస్ట్రీకి దూరం..
Actress Gajala: వాసి వాడి తస్సాదియ్యా.. అందాలతో హార్ట్ ఎటాక్ తెప్పిస్తోన్న ఎన్టీఆర్ హీరోయిన్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.