Market Mahalakshmi OTT: ఆహా ఓటీటీలో ‘పార్వతీశం’ ప్రేమకథ.. మార్కెట్ మహాలక్ష్మి స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

|

Jul 01, 2024 | 9:45 PM

ఏప్రిల్ 19న థియేటర్లలో విడుదలైన మార్కెట్ మహాలక్ష్మి సినిమా ఓ మోస్తరుగా ఆడింది. ముఖ్యంగా యూత్ ను బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా హీరోయిన్‌కు మొదటి సినిమానే అయినా కూడా తన నటనతో యూత్‌ను మెప్పించిందని ప్రశంసలు, రివ్యూలు వచ్చాయి

Market Mahalakshmi OTT: ఆహా ఓటీటీలో పార్వతీశం ప్రేమకథ.. మార్కెట్ మహాలక్ష్మి స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
Market Mahalakshmi Movie
Follow us on

‘కేరింత’ఫేమ్‌ పార్వతీశం హీరోగా నటించిన తాజా చిత్రం మార్కెట్‌ మహాలక్ష్మీ. క్లాస్ అబ్బాయి, మాస్ అమ్మాయి మధ్య జరిగే ఈ ప్రేమకథకు వీఎస్ ముఖేశ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ద్వారా ప్రణీకాన్వికా అనే అమ్మాయి హీరోయిన్‌గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయింది. ఏప్రిల్ 19న థియేటర్లలో విడుదలైన మార్కెట్ మహాలక్ష్మి సినిమా ఓ మోస్తరుగా ఆడింది. ముఖ్యంగా యూత్ ను బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా హీరోయిన్‌కు మొదటి సినిమానే అయినా కూడా తన నటనతో యూత్‌ను మెప్పించిందని ప్రశంసలు, రివ్యూలు వచ్చాయి. థియేటర్లలో ఆడియెన్స్ ను మెప్పించిన మార్కెట్ మహాలక్ష్మి సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో మూవీ స్ట్రీమింగ్ తేదీని సోమవారం (జులై 1) ఆహా ఓటీటీ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా వెల్లడించింది. జులై 4 నుంచి మార్కెట్ మహాలక్ష్మి స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిపింది. ‘మార్కెట్ మహాలక్ష్మి.. మూవీ మరికొన్ని రోజుల్లో వస్తోంది. జులై 4న మార్కెట్ మహాలక్ష్మి ప్రీమియర్’ అంటూ సినిమాకు సంబంధించిన కొత్త పోస్టర్ ను పంచుకుంది ఆహా.

 

ఇవి కూడా చదవండి

బి2పి స్టూడియోస్ ద్వారా అఖిలేష్ కలారు మార్కెట్ మహాలక్ష్మి సినిమాను నిర్మించారు. ఈ చిత్రంలో హర్ష వర్ధన్, మహబూబ్ బాషా, ముక్కు అవినాష్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. థియేటర్‌లో మెప్పించిన ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఇక సినిమా కథ విషయానికి వస్తే.. ఇందులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి పాత్రలో పార్వ‌తీశం నటించగా, మార్కెట్‌లో కూర‌గాయలు అమ్ముకునే అమ్మాయి పాత్రలో ప్రణీకాన్వికా అద్భుతమైన నటన ప్రదర్శించింది. వీరిద్దరి మధ్య ప్రేమ ఎలా మొదలైంది. కొడుకు వల్ల కట్నం వస్తుందని ఆశించిన తండ్రిని ఒప్పించేందుకు పార్వతీశం ఎలాంటి పథకం వేశాడు? మహాలక్ష్మి కోసం సాఫ్ట్‌వేర్‌ కుర్రాడు తీసుకున్న నిర్ణయమేంటో తెలుసుకోవాలంటే మార్కెట్ మహాలక్ష్మి సినిమా చూడాల్సిందే.

జులై 4 నుంచి స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.