AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Harom Hara OTT: ఓటీటీలోకి సుధీర్ బాబు లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్.. ‘హరోం హర’ స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

హంట్, మామా మశ్చీంద్ర వంటి డిఫరెంట్ సినిమాలతో నటుడిగా మరో మెట్టు పైకెక్కాడు సుధీర్‌ బాబు. కానీ దురదృష్టవశాత్తూ ఈ సినిమాలు కమర్షియల్ గా విజయం సాధించలేకపోయాయి. అందుకే ఈసారి కేజీఎఫ్, పుష్పల స్టైల్ ను ఫాలో అవుతూ హ‌రోంహ‌ర‌ ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్ టైనర్ తో మన ముందుకు వచ్చాడు. జ్ఞాన‌సాగ‌ర్ ద్వార‌క ద‌ర్శ‌క‌త్వం వహించిన మాళ‌వికా శ‌ర్మ హీరోయిన్‌గా న‌టించింది

Harom Hara OTT: ఓటీటీలోకి సుధీర్ బాబు లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్.. 'హరోం హర' స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
Harom Hara Movie
Basha Shek
|

Updated on: Jul 01, 2024 | 4:37 PM

Share

హంట్, మామా మశ్చీంద్ర వంటి డిఫరెంట్ సినిమాలతో నటుడిగా మరో మెట్టు పైకెక్కాడు సుధీర్‌ బాబు. కానీ దురదృష్టవశాత్తూ ఈ సినిమాలు కమర్షియల్ గా విజయం సాధించలేకపోయాయి. అందుకే ఈసారి కేజీఎఫ్, పుష్పల స్టైల్ ను ఫాలో అవుతూ హ‌రోంహ‌ర‌ ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్ టైనర్ తో మన ముందుకు వచ్చాడు. జ్ఞాన‌సాగ‌ర్ ద్వార‌క ద‌ర్శ‌క‌త్వం వహించిన మాళ‌వికా శ‌ర్మ హీరోయిన్‌గా న‌టించింది. సునీల్‌, అక్ష‌రా గౌడ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. హ‌రోంహ‌ర టీజ‌ర్స్‌, ట్రైలర్స్ కొత్త‌గా ఉండ‌టంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. ప్ర‌మోష‌న్స్ కూడా గట్టిగా నిర్వహించారు. ఇలా భారీ అంచనాల మధ్య జూన్ 14న థియేటర్లలో రిలీజైన హరోంహర పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లే రాబట్టింది. కథలో కొత్త దనం ఉన్నా టేకింగ్ రొటీన్ గా ఉండడంతో యావరేజ్ రిజల్ట్ తోనే సరిపెట్టుకుంది. ఇప్పుడీ యాక్షన్ ఎంటర్ టైనర్ డిజిటల్ స్ట్రీమింగ్ కు రానుంది. హరోం హర మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో జూలై 12 నుంచి సుధీర్ బాబు సినిమా స్ట్రీమింగ్ కానున్న‌ట్లు స‌మాచారం.

ఇవి కూడా చదవండి

త్వ‌ర‌లోనే హ‌రోంహ‌ర ఓటీటీ రిలీజ్ డేట్‌పై అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు స‌మాచారం. కాగా హరోంహర అమెజాన్ ప్రైమ్ తో పాటు ఆహా ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్న‌ట్లు స‌మాచారం. ఈ మేరకు రెండు ఓటీటీ సంస్థ‌ల‌తో మేక‌ర్స్ డీల్ కుదుర్చుకున్న‌ట్లు టాక్ నడుస్తోంది. త్వరలోనే దీనిపై కూడా క్లారిటీ రానుంది. ఇక హరోం హర సినిమా కథ విషయానికి వస్తే.. సుబ్ర‌హ్మ‌ణం (సుధీర్ బాబు) కుప్పం పాలిటెక్నిక్ కాలేజీలో ల్యాబ్ అసిస్టెంట్‌గా చేరతాడు. అయితే స్థానికంగా ఉండే త‌మ్మిరెడ్డి (ల‌క్కీ ల‌క్ష్మ‌ణ్‌) మనుషులతో గొడవ కారణంగా సుబ్రహ్మణ్యం ఉద్యోగం పోతుంది. దీంతో గన్ స్మగ్గింగ్ వ్యాపారంలోకి అడుగు పెడతాడు. ఒక సామాన్యుడైన సుబ్రమణ్యం కుప్పం ప్రాంతంలో తిరుగులేని గ్యాంగస్టర్ గా ఎలా ఎదిగాడు? త‌మ్మిరెడ్డిని ఎలా ఎదుర్కొన్నాడన్నదే హరోం హర మూవీ కథ.

సుధీర్ బాబు ‘హరోం హర’ రిలీజ్ టీజర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us