టాలీవుడ్ హీరో నితిన్, లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఎక్స్‌ట్రా ఆర్డినరి మ్యాన్’. నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా తో దర్శకుడిగా మారిన వక్కంతం వంశీ ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్ మూవీని తెరకెక్కించారు. సీనియర్ హీరో రాజశేఖర్ మరో కీలక పాత్రలో నటించారు. డిసెంబర్ 8న థియేటర్లలోకి వచ్చిన ‘ఎక్స్‌ట్రా ఆర్డినరి మ్యాన్’ యావరేజ్‌గా నిలిచింది. ఈ సినిమా రిలీజ్ సమయంలోనే నాని హాయ్ నాన్న రిలీజ్ కావడంతో నితిన్ మూవీకి మైనస్‌గా మారింది. హాయ్ నాన్నకు ఫుల్ పాజిటివ్ టాక్ రావడంతో ‘ఎక్స్‌ట్రా ఆర్డినరి మ్యాన్’ పోటీలో వెనకబడింది. ఓ మోస్తరు కలెక్షన్లతోనే సరిపెట్టుకుంది. అయితే సినిమాలో నితిన్, శ్రీలీల డ్యాన్సులు, కామెడీ సీన్స్ ఆడియెన్స్‌కు బాగా అలరించాయి. ఇక డేంజర్ పిల్ల సాంగ్ యూట్యూబ్‌లో చార్ట్ బస్టర్‌గా నిలిచింది. ఇలా ఎన్నో విశేషాలున్న ఎక్స్‌ట్రా ఆర్డినర్ మ్యాన్ డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ నితిన్, శ్రీలీల మూవీ డిజిటల్ హక్కులను కొనుగోలు చేసింది. ఈనేపథ్యంలో ఎక్స్‌ట్రా ఆర్డినర్ మ్యాన్ ఓటీటీ రిలీజ్‌కు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చేసింది. త్వరలోనే ఈ మూవీని ఓటీటీలోకి అందుబాటు తెస్తామని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. అయితే ఏ తేదీ నుంచి స్ట్రీమింగ్‌కు వస్తుందనే సమాచారం మాత్రం ఇవ్వలేదు.
అయితే సంక్రాంతి సందర్భంగా జనవరి 12 లేదా 13వ తేదీల్లో ఎక్స్‌ట్రా ఆర్డినరి మ్యాన్ మూవీని స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే నితిన్ సినిమా ఓటీటీ రిలీజ్‌డేట్‌పై అధికారిక ప్రకటన వెలువడనుందని సమాచారం. ఎక్స్‌ట్రా ఆర్డినరి మ్యాన్ సినిమాలో రావు రమేష్, పవిత్రా లోకేష్, బ్రహ్మాజీ, సుధేవ్ నాయర్, సంపత్ రాజ్, అజయ్ హర్షవర్దన్, హరి తేజ, రోహిణీ తదితరులు కీలకపాత్రలు పోషించారు. శ్రేష్ట్ మూవీస్, ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్టైన్మెంట్స్, రుచిర ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై ఎన్.సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి ఎక్స్‌ట్రా ఆర్డినరి మ్యాన్ సినిమాను నిర్మించారు. చాలా రోజుల తర్వాత హరిస్ జయరాజ్ స్వరాలు సమకూర్చారు.
There’s nothing ordinary about this man – he’s a combination of crazy, mad and EXTRA funny!
Are you ready for the extraordinary man? Coming Soon ❤️🔥#ExtraOrdinaryManonHotstar@actor_nithiin @ActorRajasekhar @sreeleela14 @vamsivakkantham@Jharrisjayaraj pic.twitter.com/bInTUiDv9s
— Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) January 9, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.