AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

The Trial OTT: ఓటీటీలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. ‘ది ట్రయల్’ స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా ?..

ఎలాంటి ప్రకటన లేకుండానే డిజిటల్ ప్లాట్ ఫాంపై స్ట్రీమింగ్ అవుతుంది. అదే 'ది ట్రయల్'. యుగ్ రామ్, వంశీ కోటు, స్పందన పల్లి ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాకు రామ్ గన్నీ దర్శకత్వం వహించారు. ఎస్ఎస్ ఫిల్మ్స్, కామన్ మేన్ ప్రొడక్షన్ బ్యానర్స్ పై స్మృతి సాగి, శ్రీనివాస్ కె. నాయుడు నిర్మించారు. లేడీ ఓరియంటెడ్ కథతో రూపొందించిన ఈ సినిమా గతేడాది నవంబర్ 24న థియేటర్లలో విడుదలైంది.

The Trial OTT: ఓటీటీలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. 'ది ట్రయల్' స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా ?..
The Trial Ott
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 09, 2024 | 6:16 PM

ప్రస్తుతం ఓటీటీలో సూపర్ హిట్ చిత్రాలు.. క్రైమ్ థ్రిల్లర్ మూవీస్.. సస్పెన్స్ థ్రిల్లింగ్ సినిమాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. థియేటర్లలో సూపర్ హిట్ అయిన సినిమాలు ఇప్పుడు మరోసారి అడియన్స్ ముందుకు వస్తున్నాయి. తాజాగా మరో హిట్ మూవీ ఓటీటీకి వచ్చేసింది. ఎలాంటి ప్రకటన లేకుండానే డిజిటల్ ప్లాట్ ఫాంపై స్ట్రీమింగ్ అవుతుంది. అదే ‘ది ట్రయల్’. యుగ్ రామ్, వంశీ కోటు, స్పందన పల్లి ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాకు రామ్ గన్నీ దర్శకత్వం వహించారు. ఎస్ఎస్ ఫిల్మ్స్, కామన్ మేన్ ప్రొడక్షన్ బ్యానర్స్ పై స్మృతి సాగి, శ్రీనివాస్ కె. నాయుడు నిర్మించారు. లేడీ ఓరియంటెడ్ కథతో రూపొందించిన ఈ సినిమా గతేడాది నవంబర్ 24న థియేటర్లలో విడుదలైంది. భారీ క్యూరియాసిటీ మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులను మాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఇక ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది ఈ మూవీ.

ఎలాంటి ప్రకటన లేకుండానే ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు థియేటర్లలో మిస్ అయిన అడియన్స్.. ఇప్పుడు ఇంట్లోనే చూసేయ్యోచ్చు. ముఖ్యంగా క్రైమ్ థ్రిల్లర్ జోనర్ ఇష్టపడేవారు ఇప్పుడు నేరుగా ఈ చిత్రాన్ని ఇంట్లోనే చూడొచ్చు. ఈ చిత్రానికి శరవణ వాసుదేవన్ సంగీతం అందించారు.

కథ విషయానికి వస్తే..

రూప (స్పందన) పోలీస్ ఆఫీసర్. తన భర్త అజయ్ (యుగ్ రామ్)తో కలిసి ఓ బిల్డింగ్ పై తమ వివాహ తొలి వార్షికోత్సవాన్ని జరుపుకుంటారు. అదే సమయంలో అజయ్ బిల్డింగ్ పై నుంచి కింద పడి మరణిస్తాడు. దీంతో అతడి కుటుంబం రూపపై అనుమానం వ్యక్తం చేస్తుంది. రూప అజయ్ ను హత్య చేసిందని అనుమానిస్తారు. ఈ కేసును రాజీవ్ (వంశీ కొటు) దర్యాప్తు చేస్తారు. ఈ క్రమంలో స్పందన, యుగ్ రామ్ మధ్య జరిగిన కొన్ని విషయాలు బయటకు వస్తుంది. అజయ్ మృతి ప్రమాదామా ? లేదా హత్యనా ? దర్యాప్తులో ఏం తేలింది ? అసలు మిస్టరీ ఏంటీ ? అనేది సినిమా.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అనాథ పిల్లల కోసం ఈ బిగ్ బాస్ బ్యూటీ ఏం చేసిందో తెలుసా? వీడియో
అనాథ పిల్లల కోసం ఈ బిగ్ బాస్ బ్యూటీ ఏం చేసిందో తెలుసా? వీడియో
ఇక పిడుగులను దారి మళ్లించవచ్చు.. శాస్త్రవేత్తల గొప్ప ప్రయోగం
ఇక పిడుగులను దారి మళ్లించవచ్చు.. శాస్త్రవేత్తల గొప్ప ప్రయోగం
ఓటీటీలోకి వచ్చేసిన ఐశ్వర్య రాజేశ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ..
ఓటీటీలోకి వచ్చేసిన ఐశ్వర్య రాజేశ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ..
వేసవిలో మామిడి పండు తింటున్నారా.? అనారోగ్యం ఆమడ దూరం..
వేసవిలో మామిడి పండు తింటున్నారా.? అనారోగ్యం ఆమడ దూరం..
సింహాచలం ప్రమాద ఘటనపై ప్రధాని సంతాపం...మృతుల‌ కుటుంబాలకు పరిహారం
సింహాచలం ప్రమాద ఘటనపై ప్రధాని సంతాపం...మృతుల‌ కుటుంబాలకు పరిహారం
అమ్మో ఎంత పెద్ద గుమ్మడి.. కానీ తినటానికి పనికి రాదు
అమ్మో ఎంత పెద్ద గుమ్మడి.. కానీ తినటానికి పనికి రాదు
షుగర్ ఉన్నవారికి ఈ రొట్టెలు చాలా మంచివి.. రోజూ తినొచ్చు
షుగర్ ఉన్నవారికి ఈ రొట్టెలు చాలా మంచివి.. రోజూ తినొచ్చు
విజయనగరం గ్రామ దేవత.. ఉత్తరాంధ్రుల ఇలవేల్పు.. పైడిమాంబ చరిత్ర..
విజయనగరం గ్రామ దేవత.. ఉత్తరాంధ్రుల ఇలవేల్పు.. పైడిమాంబ చరిత్ర..
స్వీడన్‌ వీథుల్లో సామూహిక కాల్పులు.. ముగ్గురు మృతి! వీడియో చూశారా
స్వీడన్‌ వీథుల్లో సామూహిక కాల్పులు.. ముగ్గురు మృతి! వీడియో చూశారా
బరువు తగ్గాలనుకుంటున్నారా..? అయితే ఇది తిని చూడండి..!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? అయితే ఇది తిని చూడండి..!