Nirangal Moondru OTT: క్లైమాక్స్ ట్విస్ట్ మైండ్ బ్లాక్.. ఓటీటీలోకి వచ్చేస్తోన్న సస్పెన్స్ థ్రిల్లర్.. ఎక్కడ చూడొచ్చంటే..

|

Dec 18, 2024 | 7:23 AM

థియేటర్లలో ఇప్పుడు పుష్ప 2 వసూళ్లు విధ్వంసం సృష్టిస్తోంది. మరోవైపు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లోనూ డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా తమిళంలో సూపర్ హిట్ అయిన ఓ థ్రిల్లర్ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఆ సినిమా క్లైమాక్స్ ట్విస్ట్ చూస్తే మైండ్ బ్లాక్ అంతే.

Nirangal Moondru OTT: క్లైమాక్స్ ట్విస్ట్ మైండ్ బ్లాక్.. ఓటీటీలోకి వచ్చేస్తోన్న సస్పెన్స్ థ్రిల్లర్.. ఎక్కడ చూడొచ్చంటే..
Nirangal Moondru Ott
Follow us on

కోలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ హిట్ అయిన సినిమా నిరంగల్ మూండ్రు. విభిన్నమైన ప్రయోగంగా వచ్చిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ తమిళ ప్రేక్షకులను ఆకట్టుకుంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమాలో అథర్వ మురళి, శరత్ కుమార్, రెహమాన్ కీలకపాత్రలు పోషించారు. ఈ థ్రిల్లర్ మూవీకి కార్తీక్ నరేశ్ దర్శకత్వం వహించాడు. ఒక్క రోజులో ఓ ముగ్గురు వ్యక్తుల జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయి ? అప్పటివరకు వారు పెట్టుకున్న నమ్మకాలు, సిద్ధాంతాలు అన్ని కనుమరుగు అయ్యే పరిస్థితి ఎందుకొచ్చింది అన్నదే అనే కాన్సెప్ట్ తో ఈచిత్రాన్ని తెరకెక్కించారు. టెక్నికల్ పరంగా కొత్తగా ఉన్నా.. కాన్సెప్ట్ స్క్రీన్ పై ప్రజెంట్ చేయడంలో దర్శకుడు కన్ఫ్యూజ్ కావడంతో ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన వచ్చింది.

తమిళంలో మంచి రెస్పాన్స్ అందుకున్న ఈ సినిమా డిసెంబర్ 20 నుంచి ఆహా తమిళ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఇక అదే రోజు తమిళంతోపాటు తెలుగు ఆహా ఓటీటీలోనూ అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.

నిరంగల్ మూండ్రు కథ ఇదే..

ఇవి కూడా చదవండి

వెట్రి (అథర్వ మురళి) సినిమా డైరెక్టర్ కావాలని కలలు కంటాడు. చాలా ఏళ్ల నుంచి ప్రయత్నాలు చేస్తోన్న అతడికి సినిమా చేసే ఛాన్స్ వస్తుంది. సెల్వం (శరత్ కుమార్) అవినీతిపరుడైన పోలీస్ ఆఫీసర్. డబ్బు కోసం ఎలాంటి కేసునైనా తారుమారు చేస్తుంటాడు. తన స్వభావానికి విరుద్ధంగా నిజాయితీగా నడుచుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. వసంత్ (రెహమాన్)కు స్కూల్ టీచర్ గా మంచి పేరు ఉంటుంది. ఎంతో మందికి ఆదర్శంగా నిలిచే అతడి నమ్మకాన్ని వమ్ము చేసే ఓ సంఘటన జరుగుతుంది. దీంతో ఈ ముగ్గురి జీవితాల్లో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అనేది సినిమా. ఈ చిత్రం ఇప్పుడు ఆహా ఓటీటీలోకి రాబోతుంది.

ఇది చదవండి : Bigg Boss 8 Telugu: ముగిసిన ఓటింగ్.. బిగ్‏బాస్ విన్నర్ అతడేనా.. ఊహించని రిజల్ట్స్..

Tollywood: ఏందీ గురూ.. ఈ హీరోయిన్ ఇట్టా మారిపోయింది.. అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు గ్లామర్ క్వీన్‏గా..

Tollywood: ప్రియుడితో పెళ్లి.. ఐదు నెలలకే ప్రెగ్నెన్సీ.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..

Tollywood: ఈ అమ్మాయి గాత్రానికీ ఫిదా అవ్వాల్సిందే.. హీరోయిన్స్‏ను మించిన అందం.. ఎవరంటే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.