
చాలా కాలం తర్వాత టాలీవుడ్ యాక్టర్ నవదీప్ లీడ్ రోల్‌లో నటించిన చిత్రం లవ్ మౌళి. దర్శక ధీరుడు రాజమౌళి శిష్యుడు అవనీంద్ర తెరకెక్కించిన ఈ బోల్డ్ లవ్ స్టోరీలో పంఖురి గిద్వాని హీరోయిన్ గా నటించింది. ఛార్వీ దత్తా మరో ఫీమేల్ లీడ్ లో కనిపించింది. భళ్లాల దేవ రానా దగ్గుబాటి అతిథి పాత్రలో మెరిశాడు. పోస్టర్స్, టీజర్లు, ట్రైలర్ తోనే లవ్ మౌళి సినిమాపై బజ్ క్రియేట్ అయ్యింది. దీనికి తోడు నవదీప్ గెటప్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ప్రమోషన్లు కూడా గట్టిగా నిర్వహించారు. అందుకు తగ్గట్టుగానే జూన్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన లవ్ మౌళి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. నవదీప్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. సినిమా చూసినవారంతా నవదీప్ కొత్తగా కనిపించాడు, లుక్స్ బాగున్నాయి, యాక్టింగ్ బాగుంది అని పాజిటివ్ రివ్యూలు ఇచ్చారు. అయితే కొన్ని కారణాలతో లవ్ మౌళి సినిమా లాంగ్ రన్ లో ఆడలేకపోయింది. దీంతో అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైందీ నవ దీప్ సినిమా. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా లవ్ మౌళి సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో నవదీప్ సినిమా స్ట్రీమింగ్ గురించి అప్ డేట్ ఇచ్చారు ఆహా మేకర్స్.
త్వరలోనే ఆహా ఓటీటీలో ‘లవ్ మౌళి’ స్ట్రీమింగ్ కానుందని సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేశారు మేకర్స్. సినిమాకు సంబంధించి కొత్త పోస్టర్ ను షేర్ చేస్తూ.. ‘తను ప్రేమ గురించి మిమ్మల్ని గట్టిగా ఆలోచించేలా చేస్తాడు. త్వరలోనే ఆహాలో లవ్ మౌళి జర్నీని ఎక్స్‌పీరియన్స్ చేయండి’ అని క్యాప్షన్ ఇచ్చింది ఆహా. అయితే స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడనే విషయాన్ని మాత్రం ఇంకా ఫైనలైజ్ చేయలేదు. త్వరలోనే అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్ ను కూడా అనౌన్స్ చేసే అవకాశం ఉంది. నైరా క్రియేషన్స్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్, సి స్పేస్ సంయుక్తంగా లవ్ మౌళి సినిమాను తెరకెక్కించారు. గోవింద్ వసంత ఈ సినిమాకు స్వరాలు సమకూర్చారు. మరి థియేటర్లలో లవ్ మౌళి సినిమాను మిస్ అయ్యారా? అయితే కొద్ది రోజులు వెయిట్ చేయండి. త్వరలోనే ఆహా ఓటీటీలోకి రానుంది. ఎంచెక్కా ఇంట్లోనే నవ్ దీప్ ప్రేమకథను చూసేయండి.
He will make you think hard about LOVE ♥️
Experience the journey of #LoveMouli COMING SOON on #Aha.@pnavdeep26 @pankhurigidwan1 #GovindVasantha @IananthaSriram #AnishKrishnan @cspaceg @NyraCreations @thaikudambridge pic.twitter.com/n8BkgDEEzS— ahavideoin (@ahavideoIN) June 19, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.