Saripodhaa Sanivaaram OTT: ఓటీటీలోకి వచ్చేస్తోన్న నాని బ్లాక్ బస్టర్ హిట్.. ‘సరిపోదా శనివారం’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్..

యాక్షన్ థ్రిల్లర్ మూవీగా వచ్చిన ఈ చిత్రంలో నాని సరసన కోలీవుడ్ హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటించగా.. నటుడు సూర్య కీలకపాత్రలో కనిపించాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ సినిమా గతంలో తెరకెక్కించిన చిత్రాలకు భిన్నంగా యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో వివేక్ ఆత్రేయ అద్భుతంగా రూపొందించాడు.

Saripodhaa Sanivaaram OTT: ఓటీటీలోకి వచ్చేస్తోన్న నాని బ్లాక్ బస్టర్ హిట్.. సరిపోదా శనివారం స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్..
Saripodhaa Sanivaaram Movie

Updated on: Sep 21, 2024 | 12:36 PM

న్యాచురల్ స్టార్ నాని ఇప్పుడు వరుస హిట్లతో ఫుల్ జోష్ మీదున్నారు. కొన్ని నెలల క్రితమే హాయ్ నాన్న సినిమాతో సూపర్ హిట్ అందుకున్నా ఈ హీరో.. ఇప్పుడు సరిపోదా శనివారం మూవీతో మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. యాక్షన్ థ్రిల్లర్ మూవీగా వచ్చిన ఈ చిత్రంలో నాని సరసన కోలీవుడ్ హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటించగా.. నటుడు సూర్య కీలకపాత్రలో కనిపించాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ సినిమా గతంలో తెరకెక్కించిన చిత్రాలకు భిన్నంగా యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో వివేక్ ఆత్రేయ అద్భుతంగా రూపొందించాడు. ఈ చిత్రం దాదాపు రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

ఆగస్ట్ 29న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా సూర్య, నాని నటనకు అడియన్స్ ఫిదా అయ్యారు. ఇన్నాళ్లు థియేటర్లలో అలరించిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే సరిపోదా శనివారం సినిమాను ఈనెల 26 నుంచి సినీ ప్రియుల ముందుకు తీసుకువస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. తెలుగుతోపాటు తమిలం, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు నెట్ ఫ్లిక్స్ తెలిపింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టర్ నెట్టింట వైరలవుతుంది.

ఇవి కూడా చదవండి

కథ విషయానికి వస్తే..
సూర్య (నాని)కి కోపం ఎక్కువ. అయితే ఆ కోపాన్ని కేవలం శనివారం మాత్రమే చూపిస్తానని తన తల్లికి మాటిస్తాడు. తాను కొట్టాలనుకుంటున్న పేర్లను డైరీలో రాసుకుంటూ కేవలం శనివారం మాత్రమే వారిపై దాడి చేస్తాడు. ఈ క్రమంలోనే సోకులపాలెం సీఐ దయానంద్ (ఎస్జే సూర్య) శాడిస్ట్ పోలీస్ ఆఫీసర్. అన్నయ్య కూర్మాచలం (మురళిశర్మ) కారణంగా దయానంద్ కు రావాల్సిన కోట్ల ఆస్తి చేజారిపోతుంది. అన్న పై ఉన్న కోపాన్ని సోకులపాలెం ప్రజలపై చూపిస్తుంటాడు. దీంతో అతడి బారి నుంచి ప్రజలను కాపాడాలని ఫిక్స్ అయిన సూర్య.. దయానంద్ కు ఎదురుతిరుగుతాడు. సూర్య, దయానంద్ గొడవ ఎలా ముగిసింది.. ? సూర్యకు అండగా ఉన్న చారులవ ఎవరు ? అనేది సినిమా.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.