Jetty OTT: థియేటర్లలో రిలీజైన ఏడాదికి ఓటీటీలోకి వచ్చేసిన ఫీల్‌గుడ్‌ మూవీ.. ‘జెట్టీ’ స్ట్రీమింగ్ ఎక్కడంటే?

|

Nov 18, 2023 | 5:58 PM

ప్రస్తుతం థియేటర్లలో విడుదలైన నెలలోపే ఓటీటీల్లోకి సినిమాలు వస్తోన్న రోజులివి. కొన్ని సినిమాలైతే రెండు మూడు వారాలకే డిజిటల్‌ స్ట్రీమింగ్‌ కు వచ్చేస్తున్నాయి. అయితే ఒక సినిమా థియేటర్లలో విడుదలైన ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చేసింది. అదే నందితా శ్వేత ప్రధాన పాత్రలో నటించిన ఫీల్‌ గుడ్ ఎమోషనల్‌ మూవీ జెట్టీ.

Jetty OTT: థియేటర్లలో రిలీజైన ఏడాదికి ఓటీటీలోకి వచ్చేసిన ఫీల్‌గుడ్‌ మూవీ.. జెట్టీ స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Jetty Movie
Follow us on

ప్రస్తుతం థియేటర్లలో విడుదలైన నెలలోపే ఓటీటీల్లోకి సినిమాలు వస్తోన్న రోజులివి. కొన్ని సినిమాలైతే రెండు మూడు వారాలకే డిజిటల్‌ స్ట్రీమింగ్‌ కు వచ్చేస్తున్నాయి. అయితే ఒక సినిమా థియేటర్లలో విడుదలైన ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చేసింది. అదే నందితా శ్వేత ప్రధాన పాత్రలో నటించిన ఫీల్‌ గుడ్ ఎమోషనల్‌ మూవీ జెట్టీ. మత్స్యకారుల జీవితానికి ఒక చక్కటి ప్రేమకథను జోడించి సుబ్రహ్మణ్యం పిచ్చుక ఈ మూవీని తెరకెక్కించారు. మాన్యం కృష్ణ, నందిత శ్వేతా హీరో, హీరోయిన్లుగా నటించారు. తేజస్విని బెహెర, ఎంఎస్‌ చౌదరి, జి.కిశోర్‌, గోపి, జీవ, శివాజీ రాజా, సుమన్‌ శెట్టి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. గతేడాది (2022) నవంబర్ 4వ తేదీ థియేటర్లలో విడుదలైన జెట్టీ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. గ్రామీణ నేపథ్యం, అక్కడి కట్టుబాట్లు, ఆచార సంప్రదాయాలు, మత్స్యకారుల జీవన విధానాన్ని సాక్షాత్కరించేలా జెట్టీ మూవీని తెరకెక్కించారని కామెంట్లు వచ్చాయి. నందమూరి బాలకృష్ణ, త్రివిక్రమ్ వంటి ప్రముఖులు ఈ మూవీ ప్రమోషన్స్ కోసం వచ్చారంటే ఈ మూవీలో ఉన్న కంటెంట్‌ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఎన్నో ప్రశంసలు అందుకున్న ఉన్న జెట్టీ సినిమా సుమారు ఏడాది తర్వాత డిజిటల్‌ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్‌ ఆహాలో ఈ మూవీ స్ట్రీమింగ్‌ అవుతోంది. శుక్రవారం (నవంబర్‌ 17) నుంచే ఈ మూవీ ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది.

వర్ధిన్ ప్రొడక్షన్స్ పతాకంపై కె వేణు మాధవ్ జెట్టీ సినిమాను నిర్మించారు. చంద్రబోస్, శ్రీమణి, కాసర్ల శ్యామ్ రచించిన పాటలకు సిధ్ శ్రీరామ్, శంకర్ మహదేవన్, మంగ్లీ, అనురాగ్ కులకర్ణి, విజయ్ యేసుదాస్, సునీతల తీయనైన గొంతు తోడవ్వడంతో పాటలు చార్ట్‌ బస్టర్‌గా నిలిచాయి. మరీ ముఖ్యంగా ఇందులో సిధ్ శ్రీరామ్ ఆలపించిన పాట ఒకటి యూట్యూబ్‌లో 22 మిలియన్లకు పైగా వ్యూస్‌ను రాబట్టడం విశేషం. గ్రామీణ నేపథ్యం, కట్టుబాట్లు, పరువు హత్యలు లాంటి అంశాలతో ఎంతో హృద్యంగా సాగే జెట్టీ సినిమాను థియేటర్లలో మిస్‌ అయ్యారా? మరి ఎంచెక్కా ఓటీటీలో చూసి ఆనందించండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.